English | Telugu
సుమంత్ అశ్విన్ తూనీగ తూనీగ 50% పూర్తి
Updated : Mar 28, 2011
"వాన"చిత్రం ఆడియో సూపర్ హిట్టయినా చిత్రం ఫ్లాప్ చిత్రంగా మిగిలింది. తన కుమారుడు హీరోగా పరిచయం అవుతున్న ఈ "తూనీగ తూనీగ" చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తూ, మరోసారి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు యమ్ యస్ రాజు. దర్శకుడిగా తన భవిష్యత్తే కాకుండా హీరోగా తన కొడుకు సుమంత్ ఆశ్విన్ భవిష్యత్తు కూడా ఈ "తూనీగ తూనీగ" చిత్రంతో ముడిపడి ఉండటం విశేషం. ఈ చిత్రం ద్వారా ఇద్దరు హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.