English | Telugu

చిరు,పవన్ కలిశారు.. అభిమాని చనిపోయాడు


మెగాస్టార్ చిరంజీవి,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లో రెండు భిన్న ధృవాలు. ఒకరు శాంతి,సహనానికి మారుపేరు అయితే ఇంకోకరు ఆవేశం, దూకుడు కలగలిసిన వ్యక్తి. స్వతహాగా తనను ఇంత స్థాయికి తీసుకువచ్చిన అన్నయ్య అంటే పవన్‌కు భక్తి గౌరవం. అన్నయ్య మీద ఈగ వాలినా అగ్గిమీద గుగ్గిలం అవుతాడు పవన్. అన్నయ్యని నాలుగు మాటలంటేనే నిండు సభలో ఒక అగ్రనటుడి మీద వాగ్భాణాలు సంధించాడు పవన్ కళ్యాణ్ . ఐతే అదంతా గతం. ప్రజారాజ్యం పార్టీ అన్నదమ్ముల మధ్య చిచ్చు రగిల్చింది. ఏ పార్టీ నేతల్ని పంచలూడదీసి పవన్ పరుగులెత్తిస్తానన్నాడో అలాంటి పార్టీలోకి ప్రజారాజ్యాన్ని విలీనం చేయడాన్ని పవర్ స్టార్ జీర్ణించుకోలేకపోయాడు. అన్నయ్య నిర్ణయాన్ని బహిరంగంగానే విమర్శించాడు. అప్పటి నుంచి వీరిద్దరూ తలొక దిక్కు అయ్యారు. రాజకీయాల్లో అన్నయ్య బిజీ అయితే, సినిమాల్లో తమ్ముడు దూసుకెళ్తున్నాడు.

సర్దార్ గబ్బర్ సింగ్ సందర్భంగా మళ్లీ ఇద్దరు ఒక్కటవుతున్న తరుణంలో ఇద్దిరికి ఉన్న గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ వీరి మధ్య వివాదాన్ని రాజేసింది. కర్ణాటకలోని బళ్లారిలో ఒక చిరంజీవి అభిమాని పవన్ అభిమానిని కొట్టి చంపాడు. నగరంలోని కౌల్ బజార్‌కు చెందిన ఇద్దరు యువకులు ఈ నెల 20న ఒక చోట కలిశారు. వీరిలో ఒకరు పవన్ అభిమాని కాగా మరొకరు చిరంజీవికి వీరాభిమాని. ఈ క్రమంలో మా అన్న మెగాస్టార్‌ను మించిన హీరో ఎవ్వరూ లేరు అంటూ చిరు అభిమాని అన్న మాటలు వారిద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది.

ఇరువురి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరడంతో చిరంజీవి అభిమాని చేతికందిన ఐరన్ రాడ్ తీసుకుని పవన్ కళ్యాణ్ అభిమానిని చితక బాదాడు. దీంతో అతను రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఈ ఘటన ఇద్దరు అభిమానుల్ని షాక్‌కు గురిచేసింది. ఇద్దరు హీరోలు కలిస్తున్న సందర్భంలో అభిమానులు మాత్రం ఇలాంటి చర్యలతో మళ్లీ చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.