English | Telugu

సాఫ్ట్ వేర్ జీతాల కంటే సినీ కార్మికుల వేతనాలే ఎక్కువ.. తెలుగు నిర్మాతల ఆవేదన!

సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచకపోతే షూటింగ్స్ లో పాల్గొనబోమని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై సినీ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై స్పందించిన ఫిల్మ్ ఛాంబర్.. ఇప్పటికే ఉన్న కనీస వేతనాల కంటే ఎక్కువ చెల్లిస్తున్నామని తెలిపింది. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొంది.

మరోవైపు నిర్మాతలు కూడా ఫెడరేషన్ కి ధీటైన జవాబు ఇస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అయితే షూటింగ్ కోసం ఏకంగా ముంబై నుంచి సినీ కార్మికులను తీసుకొనివచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది మైత్రి. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ షూటింగ్ జరుగుతోంది. అయితే వేతనాల పెంపు డిమాండ్ తో తెలుగు సినీ కార్మికులు నేటి నుంచి బంద్ కు పిలుపునివ్వడంతో.. మైత్రి ఊహించనివిధంగా ముంబై నుండి కార్మికులను తెప్పించి షూటింగ్ నిర్వహిస్తోంది. దీనిపై తెలుగు సినీ కార్మికులు మండిపడుతున్నారు. మన కార్మికులు కష్టం హీరో పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.

ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ కూడా.. వేతనాల పెంపు డిమాండ్ తో కార్మికులు బంద్ కు పిలుపునివ్వడాన్ని తప్పుబట్టారు. సినీ కార్మికులకు బయట ఉన్న కార్మికుల కంటే ఎక్కువ పే చేస్తున్నామని, సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కంటే కూడా వీరికి వేతనాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.

ఈ విషయంపై నిర్మాత SKN సైతం ఆవేదన వ్యక్తం చేశారు. "ఇప్పటికే ధియేటర్స్ కి ఆడియన్స్ దూరం. ఇప్పుడు అదనపు వేతనాల భారం. ఓటీటీ శాటిలైట్స్ అగమ్య గోచరం. పైరసీ పుండు మీద కారం.పేరుకే వినోద పరిశ్రమ.. నిర్మాతల శ్రమ విషాదమే" అని అన్నారు.

ఏది ఏమైనా వేతనాలు పెంచడానికి నిర్మాతలు సిద్ధంగా లేరని అర్థమవుతోంది. 30 శాతం అంటే మరీ ఎక్కువ అని.. 5-10 శాతం పెంపు అయితే సాధ్యమయ్యే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.