English | Telugu
రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా!
Updated : Jan 9, 2026
-రాజా సాబ్ విషయంలో ఏం జరుగుతుంది
-రిజల్ట్ పరిస్థితి ఏంటి!
-సీక్వెల్ లో చెప్పబోతున్న కథ ఏంటి
-అసలు సీక్వెల్ ఉంటుందా
పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.
రాజాసాబ్ మూవీ చివరలో సర్కస్ ట్రైనర్ గా ముఖానికి విభిన్న రంగులని పూసుకొని ఒక ప్రభాస్ చాలా కోపంగా రాజా గా చేసిన మరో ప్రభాస్ ని చూస్తాడు. ఆ వెంటనే రాజా సాబ్ కి సీక్వెల్ ఉన్నట్టుగా ది రాజాసాబ్ 2 :సర్కస్ 1935 'అనే టైటిల్ ని మేకర్స్ ప్రదర్శించడం జరిగింది. దీంతో ఇద్దరు ప్రభాస్ లతో రాజాసాబ్ సీక్వెల్ తెరకెక్కడం ఖాయమయ్యి ఒకరు ప్రతినాయకుడిగా ఉంటే అభిమానులకి మరో పండుగ వచ్చినట్టే అనే మాటలు సోషల్ మీడియా వేదికగా వినపడుతున్నాయి.
రాజాసాబ్ ని మారుతీ(Maruthi)దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(people Media factory)సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ జతకట్టగా థమన్ మ్యూజిక్ అందించాడు. ప్రభాస్ తాత గా సంజయ్ దత్, నాయనమ్మ గా జరీనా వాహెబ్ కనిపించారు.