English | Telugu
'టెంపర్' హంగామాకి రెడీ
Updated : Feb 12, 2015
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన 'టెంపర్' చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ బెనిఫిట్ షో రేపు ఉదయం 3.45నిముషాలకు హైదరాబాద్ కూకట్ పల్లిలోని మల్లిఖార్జున థియేటర్ లో స్ర్కీనింగ్ కానుంది.ఈ బెనిఫిట్ షో కి భారీ క్రేజ్ నెలకొంది. ఈ షో ని డైరెక్టర్ రాజమౌళి, పూరి జగన్నాధ్ తో పాటు ఈ చిత్రం యూనిట్ కి చెందిన కొంతమంది సాంకేతిక నిపుణులు కూడా వీక్షించబోతున్నారట. రాంగోపాల్ వర్మ కూడా ఈ షోని చూడబోతున్నారు. ఎన్టీఆర్ అభిమానులతో చిందేయబోతున్నానని ఇప్పటికే రామూ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. సో... 'టెంపర్' సందడి షురూ అయిపోయింది.