English | Telugu
'టెంపర్' 50 కోట్ల క్లబ్‌లో చేరుతుందా?
Updated : Feb 12, 2015
ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రానున్న 'టెంపర్'పై హై రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. పూరి ఈ సినిమాని ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడు. 'ఆంధ్రావాలా' ఫ్లాప్ తర్వాత, ఎలాగైనా ఎన్టీఆర్‌తో హిట్ కొట్టాలనే కసితో సరైన టైమ్ కోసం ఎదురు చూసిన పూరికి ఇన్నాళ్లకి యంగ్‌టైగర్‌తో సెట్ అయింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా చాలా కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ స్టిల్‌కీ, వీడియోకీ సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం ఎన్టీఆర్ కెరీర్ లో 50 కోట్ల క్లబ్‌లో చేరే తొలి చిత్రంగా 'టెంపర్' రికార్డులకెక్కుతుందని అంటున్నారు. ఎన్టీఆర్‌కి మాస్‌లో ఉన్న క్రేజ్‌ని చూసుకుంటే, 'టెంపర్' ఏమాత్రం ఆ అంచనాలకు తగ్గట్టుగా ఉన్నా.. పూరి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సెన్సేషనల్ హిట్ రావడం ఖాయం.