Read more!

English | Telugu

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ లో గోపీచంద్

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ లో గోపీచంద్ నటించనున్నాడని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే గతంలో నేటిభారతం, రేపటిపౌరులు, దేవాలయం, ప్రతిఘటన వంటి ఎన్నో సామాజిక స్పృహకలిగిన, ఉన్నత విలువలతో కూడిన సినిమాల్కు దర్శకత్వం వహించిన స్వర్గీయ టి.కృష్ణ కుమారుడు గోపీచంద్ హీరోగా సినీ రంగ ప్రవేశం చేసినా, విలన్ గా రాణించి, మళ్ళీ హీరోగా రూపాంతరం చెందాడు. గోపీచంద్ ప్రస్తుతం "మొగుడు" సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాప్సి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని నల్లమలపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ లో నటించటానికి అంగీకరించాడని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ సినిమా కుటుంబకథా చిత్రంగా రూపొందనుందట. ఈ సినిమాకి సంబంధించిన మిగిలిన వివరాలు అంటే దర్శకుడెవరు...? హీరోయిన్ ఎవరు...? అన్నవివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.