English | Telugu

మనకి జాతీయ అవార్డులెందుకు రావు

మనకి జాతీయ అవార్డులెందుకు రావు...? అన్న ప్రశ్న ప్రతి తెలుగు ప్రేక్షకుడినీ కలవరపరిచేదిగా ఉందనటంలో సందేహం అక్కరలేదు. వంద కోట్లమంది భారతీయుల్లో ఒలంపిక్స్ లో బంగారు పతకం తెచ్చే వాళ్ళే లేరా...? అన్న ప్రశ్నలాగా పై ప్రశ్న చాలా కాలంగా వేధిస్తూంది. భారతదేశంలోనే మన తెలుగు సినీ పరిశ్రమ రెండవ అతిపెద్ద సినీ పరిశ్రమగా ఖ్యాతికెక్కింది. ఇంకా చెప్పాలంటే చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎక్కువ గిన్నీస్ రికార్డులు కూడా మన తెలుగు సినీ పరిశ్రలోనే ఉన్నాయి.

యన్ టి ఆర్ ప్రపంచంలోనే అత్యభికంగా 18 సార్లు శ్రీకృష్ణుడిగా చలన చిత్రాల్లో నటించటం, ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ గా శ్రీమతి విజయనిర్మల, ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా దాసరి నారాయణరావు, ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు నిర్మించిన నిర్మాతగా డాక్టర్ డి.రామానాయుడు, అలాగే డాక్టర్ యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ బ్రహ్మానందం వంటి వారంతా మన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారే. అయినా దాదాపు ఎనభై యేళ్ళ చరిత్ర కలిగిన మన తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు ఎన్ని వచ్చాయో వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.

ఏం...? ఇక్కడ ప్రతిభ లేదా...? అంటే కావలసినంత ఉంది. కాని మనం మన సినిమాలను హీరోల కోసమే తీస్తాం. వాళ్ళని ఆరాథ్య దైవాలుగా చూస్తుంటాం. కానీ వాళ్ళల్లో ఎవరికీ జాతీయ అవార్డులు సంపాదించే అర్హత లేదు. కారణం వాళ్ళెప్పుడూ నా సినిమా తొలి రోజు ఎంత వసూలు చేసింది......? ఎన్ని సెంటర్లలో వంద రోజులాడింది...? ఎన్ని రికార్డులు బ్రేక్ చేసింది...? నాకు కాస్ట్యూమ్స్ ఏ దేశం నుంచి ఎంత ఖరీదైనవి తెప్పిస్తున్నారు...? నా సినిమాలో ఫైట్స్ లో నేను ఎంత మందిని తంతే నా ఫ్యాన్స్ కి నచ్చుతుంది....? డ్యాన్సుల్లో ఎలాంటి స్టెప్పులు వేయాలి...? నా సినిమాల్లో ఎంతమంది హీరోయిన్లు ఉండాలి...? అన్నవాటి మీద ఉన్న శ్రద్ధ నేను నటించిన సినిమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఎందుకు రాదు అని ఏ ఒక్కరన్నా ఆలోచిస్తే నేటి ఈ దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చేది కాదు. పాపం మన హీరోలు తమ సినిమాల్లో బిల్డప్పుల మీద ఉన్న శ్రద్ధ పాత్రల ఎంపికలో, అలా ఎంచుకున్న పాత్రల పోషణలో చూపిస్తే మన తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడో బాగుపడేది.

నేను నటించిన సినిమాలూ, నా పేరు తెలుగు సినీ చరిత్రలో నాలుగు కాలాలు నిలిచి ఉండాలంటే నేనెలాంటి సినిమాలు చేయాలి...? నెనెలాంటి పాత్రలను ఎంచుకోవాలి...? అన్న జ్ఞానం మన సో కాల్డ్ హీరోల్లో ఎంతమందికి ఉందంటారు...? నాకనుమానమే....మన హీరోల మైండ్ సెట్ మారనంతవరకూ, మన నిర్మాతలూ, మన దర్శకులూ చేయగలిగింది ఏమీ లేదనే చెప్పాలి. భవిష్యత్తులోనైనా కనీసం ఒక్క హీరోకైనా ఇలాంటి కనువిప్పు కలిగి మన తెలుగు సినిమా పేరుని జాతీయ స్థాయిలో మారుమ్రోగేట్టు చేస్తారని ఆశిద్దాం....

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.