English | Telugu

బెస్ట్ బాబాయ్- అబ్బాయ్ ఎవరు...!

మన తెలుగు సినీ పరిశ్రమలో బెస్ట్ బాబాయ్- అబ్బాయ్ ఎవరు...! అనే ప్రశ్న ఇటీవల ఫిలిం నగర్ లో బాగా పాప్యులర్ చర్చగా మారింది. బాబాయ్-అబ్బాయ్ ల విషయానికొస్తే యువరత్న నందమూరి బాలకృష్ణ - యంగ్ టైగర్ యన్ టి ఆర్, విక్టరీ వెంకటేష్ - మ్యాన్లీ హీరో హీరో రానా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ మూడు జోడీలూ మన తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ బాబాయ్ - అబ్బాయ్ లని చెప్పవచ్చు. ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్ బాబాయ్ - అబ్బాయ్ అనేదానిమీదే ఇప్పుడు చర్చ జరుగుతుంది.

వీరిలో ముందుగా నందమూరి బాలకృష్ణ-యన్ టి ఆర్ లను తీసుకుంటే అబ్బాయ్ కి బాబాయ్ కో-ఆపరేషన్ బాగా ఉందని చెప్పవచ్చు. అబ్బాయ్ సినిమా ప్రారంభోత్సవాలకీ, ఆడియో ఫంక్షన్ లకీ, సక్సస్ మీట్ లకీ బాబాయ్ బాలకృష్ణ హాజరై, అబ్బాయ్ ని పొగడ్తలతో ముంచెత్తటం, అతని సినిమా ప్రమోషన్ లో పాలుపంచుకోవటం వంటి పనులు చాలా శ్రద్ధగా చేస్తూంటారు.

పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ లను తీసుకుంటే బాబాయ్ అబ్బాయ్ కి పెద్దగా ఉపయోగపడిన దాఖలాలు లేవు. దానికి పవన్ కళ్యాణ్ కి ఉన్న సిగ్గు కొంత కారణమైతే, సినిమాలో దమ్ముంటే హిట్టవుతుంది, లేకపోతే లేదు అన్న పవన్ కళ్యాణ్ ధోరణి మరి కొంత కారంణమని చెప్పవచ్చు. కానీ అబ్బాయ్ రామ్ చరణ్ మాత్రం తన ట్విట్టర్ లో బాబాయ్ ని నిరంతరం పొగుడుతూనే ఉంటాడు.

తర్వాత వెంకటేష్ - రానాలను తీసుకుంటే రానా చేసింది ఒక హిందీ రెండు తెలుగు సినిమాలు మొత్తం మూడు సినిమాలైతే వాటిలో ఇప్పటికి విడుదలైంది ఒక్క "లీడర్" మాత్రమే. అయినా కానీ అబ్బాయ్ ని పొగడ్తలతో బాబాయ్ ఆకాశానికెత్తేస్తుంటాడు. ఇలా ఈ ముగ్గురు బాబాయ్- అబ్బాయ్ లనూ తీసుకుంటే కాస్త బాలకృష్ణ-యన్ టి ఆర్ ల జోడీయే ముందున్నట్టు అనిపిస్తూంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కూడా తెలియజేయాలని కోరుతున్నాం.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.