English | Telugu

మిస్టర్ పర్ ఫెక్ట్ స్టోరీ ఏంటి...!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "మిస్టర్ పర్ ఫెక్ట్" సినిమా స్టోరీ ఏమిటి...? శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, దశరథ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన చిత్రం "మిస్టర్ పర్ ఫెక్ట్".

ఈ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం యొక్క స్టోరీ ఏమిటంటే దేన్లోనూ పర్ ఫెక్ట్ గా ఉండని ఒక కుర్రాడు, తను ప్రేమించిన అమ్మాయి కోసం తనకిష్టం లేకపోయినా "మిస్టర్ పర్ ఫెక్ట్"గా మారాలనుకుంటాడు. అలా ప్రేమించిన ప్రియురాలి కోసం ఆమె కోరినట్లుగా మారిన తర్వాత కూడా ఆమె "మా నాన్న కోసం నువ్వింకా మారాలి" అంటుందట. దాంతో ఎక్కడో కాలిన హీరో "నేను ప్రేమించింది నిన్ను కానీ, నీ యబ్బను కాదు" అని కోపంగా వెళ్ళిపోతాడట. ఆ తర్వాత ఏమయిందనేది మిగిలిన కథ అని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం.

ఈ "మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే విశేష ప్రేక్షకాదరణ పొందింది. అలాగే ఈ "మిస్టర్ పర్ ఫెక్ట్" సినిమాలో హీరో ప్రభాస్ చాలా విభిన్నంగా కనిపిస్తున్నాడు. ఇక కాజల్, తాప్సి వంటి ఇద్దరు గ్లామర్ హీరోయిన్లున్నఈ "మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీలో గ్లామర్ కి కొదవే లేదు. ఇలా అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.