English | Telugu

నిర్మాతల మండలి ఆవేదన

నిర్మాతల మండలి ఆవేదన చెందింది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర నిర్మాతల మండలి(ఎ.పి.ప్రొడ్యూసర్స్ కౌన్సిల్)వారు ప్రస్తుతం మన తెలుగు సినీ పరిశ్రమలో గత వారం రోజులుగా ఎ.పి.ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె కారణంగా నిర్మాతలు ఆర్థికంగా ఎంత నష్టపోతున్నారో, తరువాత సినిమా తీయటానికి వారికి కళాకారుల డేట్లు దొరక్క ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నారో మీడియాకు తెలియజేశారు. వారు ఇంకా మాట్లాడుతూ ప్రభుత్వ లేబర్ యాక్ట్ కన్నా, చెన్నై, కర్ణాటక, ముంబై కన్నా తెలుగు సినీ పరిశ్రమలోనే సినీ కార్మికులకు ఎక్కువ జీతాలిస్తున్నామనీ, ప్రస్తుతం వారు చేస్తున్న సమ్మెకు 32 శాతం వారి జీతాలను పెంచామనీ, అందుకు 17 క్రాఫ్టులు అంగీకారం తెలిపినా, కొందరు నాయకుల సంకుచిత,దురాశాపూరిత ధోరణుల మూలంగా ఈ సమస్య అపరిష్కృతంగా ఉండిందని వారన్నారు.


నిర్మాతలు ఇంకా మాట్లాడుతూ వారు సమ్మె విరమించి సినీ నిర్మాణాలకు సహకరిస్తే బాగుంటుందనీ, లేకుంటే తాము ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి లేబర్ యాక్ట్ కన్నా ఎంత ఎక్కువ ఇస్తున్నామో తెలియజేసి,వీరు రాకపోతే తమకు నచ్చిన వారితో తమ సినిమాలను నిర్మించుకుంటామనీ అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్, స్రవంతి రవికిశోర్, ప్రసన్న కుమార్, దిల్ రాజు, దమ్మాలపాటి శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.