English | Telugu

'హోరా హోరీ' సెన్సార్ అయిపొయింది

'అలా మొదలైంది’, ‘అంతకుముందు ఆ తరువాత’ వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్. ‘చిత్రం, ‘నువ్వు నేను’, జయం’ అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన దర్శకుడు తేజ. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘హోరా హోరీ’.

నూతన,నటీ నటులతో ప్రేమ కధా చిత్రాలను రూపొందించి, విజయం వైపు అవి ప్రయాణించేలా చేయటం దర్శకుడు ‘తేజ’ స్టయిల్. ఈ చిత్రాన్నికూడా ఆయన నూతన నటీ నటులతోనే తెరకెక్కించారు. ప్రేమ కథా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ కోడూరి సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఆడియో, థియేట్రికల్ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్ పొందింది. త్వరలోనే సినిమాని విడుదల చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటి వరకు తేజ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథాచిత్రాలు ఎంతటి ఘనవిజయాన్ని సాధించాయో మనకు తెలిసిందే. వాటికి ఏ మాత్రం తీసిపోకుండా హోరా హోరీ చిత్రం అద్భుతంగా వచ్చిందని చిత్రయూనిట్ వర్గాలు తెలియజేశాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.