English | Telugu

హీరోయిన్స్ టా"టూ" మచ్

"పచ్చబోట్టు చెరిగిపోదులే"..అంటూ అలనాటి పాటను గుర్తు చేసుకుంటున్నారో లేక "పచ్చబోట్టేసినా పిల్లగాడా " అనే బాహుబలి సాంగ్‌ మైండ్‌లో వేసుకున్నారో తెలియదు గాని మన హీరోయిన్స్ టాటూలతో దుమ్ము రేపుతున్నారు. బాడీని కాన్వాస్‌గా మార్చి చిత్రలేఖనం చేయించుకుంటున్నారు. టాటూ అనేది ఇవాళ ఓ ట్రెండ్. ఆధునికం అని తమకు తాము చెప్పుకోవడానికి ఈ ప్రాచీన కళపై మక్కువ చూపిస్తున్నారు. ఒంటిపై టాటూ పడకపోతే అప్‌డేట్ అవ్వలేదనే అభిప్రాయం మన తారల్లో ఉంది. అలాంటి నాయికల టాటూ ముచ్చట్టు మీ కోసం .

త్రిష:

టాటూల పేరెత్తితే ముందుగా గుర్తుచ్చేది త్రిష. టాటూ సెలక్షన్‌లో గానీ వేయించుకోవడంలో గానీ త్రిషను తలదన్నెవారు లేరు. ఇప్పటికే మూడు సార్లు టాటూ వేయించుకున్న ఈ చెన్నై చిన్నది ఆ తర్వాత ఒళ్లంతా టాటూల మయం చేసింది. అన్నింటిలోకి స్పెషల్ మాత్రం ఎదపై వేయించుకున్న చేప టాటూనే.

ప్రియాంక చోప్రా:

అద్బుతమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టి పడేసే బాలీవుడ్ తార ప్రియాంక చోప్రాకు తండ్రి అంటే ప్రాణం. తండ్రి మీద అభిమానానికి గుర్తుగా "డాడీస్ లిల్ గర్ల్" అని టాటూ వేయించుకుంది.

నయనతార:

థర్టీ ప్లస్‌లోనూ సౌత్ ఇండస్ట్రీని ఊపేస్తున్న నయనతార టాటూకు చాలా స్పెషాలిటీ ఉంది. అప్పట్లో ప్రభుదేవానితో ప్రేమాయణం నడిపిన నయన్, ప్రభుదేవా పేరుని టాటూగా వేయించుకుంది. అయితే ప్రభుతో తెగదెంపులు చేసుకున్నాకా..ఆ టాటూని తొలగించుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.

రోజా:

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగి ప్రజంట్ ఎమ్మెల్యే అయిన రోజా కూడా టాటూ వేయించుకుంది. అది కూడా చేతిపైనో ఇంకో చోట కాదు. ఎడమ ఎదపై టాటూ వేయించుకుంది.

ప్రగతి:

తెలుగు ఇండస్ట్రీలో యువహీరోలకు తల్లి పాత్రలో అచ్చమైన గృహిణిలా కనిపించే ప్రగతి కూడా టాటూలకీ అతీతం కాదు. ఆమె కుడి చేతి భుజంపై టాటూ వేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.

అనసూయ:

జబర్దస్త్ షోకి యాంకరింగ్ చేయడంతో స్టార్ సెలబ్రిటి అయ్యింది అనసూయ. ఇద్దరు పిల్లల తల్లైన తర్వాత కూడా తన గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. ఈమె కూడా త్రిష రూట్లోనే టాటూ వేయించుకుని వార్తల్లోకి ఎక్కింది. అనసూయ ఎడమ ఛాతీపై నిక్కీ అన్న పేరుతో టాటూ వేయించుకుంది.

అమలాపాల్:

సౌత్‌లో మంచి ఫాలోయింగ్‌లో ఉండగానే మ్యారేజ్ చేసుకుని సెటిలైంది అమలాపాల్. ఈ ముద్దుగుమ్మ ఎంతో ఇష్టపడి ఓ టాటూని వేయించుకుంది. తన కాలి పాదం పై భాగంలో బాణం లాంటి గుర్తును, ఓ చిన్న రింగు ఆకారాన్ని పచ్చబొట్టు పొడిపించుకుంది.

ప్రియమణి:

బ్లాక్ బ్యూటి ప్రియమణి కూడా ప్రియాంక చోప్రా బాటలో తన తండ్రిపై మమకారాన్ని టాటూ రూపంలో చూపించింది. తన మోచేతి మీద "డాడీస్ గాళ్" అంటూ టాటూ వేయించుకుంది.

నమిత:

బొద్దుగుమ్మ నమిత ఓ జ్యోతిష్యుడి సలహాతో నక్షత్రాల గుంపుని తన వీపుపై టాటూగా వేయించుకుంది. ఓ పార్టీలో అది కనబడేలా డ్రెస్ వేసుకోచ్చింది.

ఛార్మి:

చేతిలో అవకాశాలు లేక ప్రజంట్ ఖాళీగా ఉన్న పంజాబీ బొమ్మ ఛార్మి తన చేతిపై డ్రాగన్ బొమ్మను టాటూగా వేయించుకుంది.

కుష్బూ:

దక్షిణాదికి టాటూని పరిచయం చేసిందే కుష్భూ ప్రజంట్ రాజకీయాలతో బిజిగా ఉన్న కుష్బూ వీపుపై నెమలిని టాటూగా వేయించుకుంది.

నమ్రత:

ఒకప్పటి హీరోయిన్, సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ కూడా టాటూలు వేయించుకుంది. తన భర్త మహేశ్‌తో పాటు పిల్లలపై తనకున్న ప్రేమకు గుర్తుగా పచ్చబొట్టు పొడిపించుకుంది. దేవనాగరి స్టైల్ ఫాంట్ డిజైన్‌తో ఆమె చేతిపై ఈ టాటూ దర్శనమిస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.