English | Telugu

ధోనీ హీరో బ్రేకప్ అయ్యాడు..!

2016 బాలీవుడ్ కు బ్రేకప్ ఏడాదిగా గుర్తుండిపోయేలా ఉంది. వరసగా పైళ్లైన జంటలు, పెళ్లికాని జంటలు బ్రేకప్పులు చెప్పేసుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో యంగ్ బాలీవుడ్ హీరో చేరాడు. ధోనీ బయోపిక్ లో హీరోగా నటిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అతని గర్ల్ ఫ్రెండ్ అంకితా లోఖాండే బైబై చెప్పేసుకున్నారు. విడిపోయినా, ఇన్నాళ్లూ ఎప్పుడూ నోరు మెదపలేదు. రీసెంట్ గా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు పెరిగిపోవడంతో, సుశాంత్ తన సన్నిహితుల వద్ద క్లియర్ కట్ గా విషయాన్ని చెప్పేశాడట. తమ ఇద్దరి మధ్యా మాటలు కూడా లేవని, విడిపోవడం తప్పలేదని సుశాంత్ స్పష్టం చేశాడట. మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనుకున్నాను. కానీ ఇలా అయినందుకు బాధగా ఉంది అంటూ ఒక అభిమాని చేసిన ట్వీట్ కు సుశాంత్ రిప్లై ఇచ్చాడు. మనుషులు ఎదిగే క్రమంలో దారులు మారుతుంటాయి. చేసేదేమీ లేదు అని అతను చేసిన ట్వీట్, బాలీవుడ్ కు బ్రేకప్ కన్ఫర్ మేషన్ ఇచ్చేసింది. రాబ్తా సినిమాలో సుశాంత్, కృతీసనన్ లు కలిసి నటిస్తున్నారు. వారిద్దరి మధ్య చనువు పెరగటమే బ్రేకప్ కు కారణమని చెప్పుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.