English | Telugu

ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్న త్రివిక్రమ్ ఫ్రెండ్

రాజమౌళి పుణ్యమా అని భీమవరం బుల్లోడు సునిల్ కెరియర్ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. వరుస సినిమాలు వస్తున్నాయే కానీ ఒక్కటీ హిట్టైన పాపానపోలేదు. దీంతో చేతినిండా ఆఫర్స్ తో బిజీగా ఉన్నా....సంతోషమే లేదని తెగ ఫీలవుతున్నాడట అందాలరాముడు. ఇప్పటివరకూ సరే...ఇకముందు ఇండస్ట్రీలో నిలబడాలంటే ఒక్కటైనా సరైన హిట్ కావాలి. అందుకే త్రివిక్రమ్ వెంటపడ్డాడట. బాబ్బాబు...ఒక్క హిట్టివ్వు అని బతిమలాడుతున్నాడట. స్నేహితుడు అంతగా అడుగుతుంటే కాదనలేకపోయాడట త్రివిక్రమ్. పైగా సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత ఎలాగూ మరోసినిమాకు కమిట్ అవ్వలేదు. సో అందాలరాముడికి మంచి హిట్టిచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇన్ సైడ్ టాక్. దీంతో త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ సునిల్ తో అని కొందరు ఫిక్సైపోయారు. కానీ ఇప్పటివరకూ పవన్, బన్నీ,మహేశ్...ఈ ముగ్గురినీ వదిలి బయటకు రాని మాటల మాంత్రికుడు సునిల్ కు నిజంగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అని క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి ఆన్సర్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి మరి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.