English | Telugu

అభిమానికి మాటిచ్చిన నాగ్‌

స్వామి రారాతో తెలుగు సినీ ప్ర‌పంచం దృష్టిలో ప‌డ్డాడు సుధీర్ వ‌ర్మ‌. చాలామంది హీరోలు సుధీర్‌తో సినిమా చేయాల‌ని ఉత్సాహం చూపించారు. కానీ... సుధీర్ మాత్రం నాగార్జున కాంపౌండ్‌లో కి అడుగుపెట్టాడు. నాగ్‌తో సినిమా చేయ‌డం త‌న ల‌క్ష్య‌మ‌న్నాడు. ఎందుకంటే సుధీర్ వ‌ర్మ నాగ్‌కి వీరాభిమాని. ఆయ‌న‌తో ఫొటో దిగాల‌నే... ఇండ్ర‌స్ట్రీకి వ‌చ్చాడ‌ట‌. అయితే అనుకోకుండా త‌న రెండో సినిమా నాగ‌చైత‌న్య‌తో చేయాల్సివ‌చ్చింది. సుధీర్ వ‌ర్మ‌లోని డెడికేష‌న్‌, టాలెంట్ చూసిన నాగ్‌.. ''మ‌న‌మిద్ద‌రం ఓ సినిమా చేయాల్సింది. కానీ కుద‌ర్లేదు. ఈసారిమాత్రం నీతో ఓ సినిమా చేస్తా..'' అంటూ స‌భాముఖంగా మాటిచ్చేశాడు. శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో దోచేయ్ ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా త‌న అభిమానికి నాగ్‌... ప్రామిస్ చేశాడు. దోచేయ్ గ‌నుక హిట్ట‌యితే.. సుధీర్‌వర్మ త‌దుప‌రి ప్రాజెక్ట్ నాగార్జున‌తోనే ఉండ‌బోతోంది.