English | Telugu

స‌గం సినిమా రీషూటా??

స్ర్కిప్టు రూపంలో ఉన్న క‌థ తెర‌పై సినిమాగా మ‌లిచేలోగా ఎన్నో మార్పులు సంత‌రించుకొంటుంది. సినిమా షూటింగ్ ముగిశాక‌... మార్పులు చేర్పులూ త‌ప్ప‌ని స‌రి. అవ‌స‌ర‌మైతే రెండు మూడు సీన్లు రీషూట్ కూడా చేస్తారు. అయితే.. ఓ సినిమా విష‌యంలో అలాకాదు. ఏకంగా స‌గం సినిమా రీషూట్ చేశార‌ట‌. ఆ సినిమానే `టైగ‌ర్‌`. సందీప్‌కిష‌న్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్ క‌థానాయ‌కులుగా న‌టించిన చిత్ర‌మిది. 75 శాతం సినిమా పూర్త‌య్యాక‌.. కొంత‌మంది సినీ ప్ర‌ముఖుల‌కు `టైగ‌ర్‌` చూపించార‌ట‌. వాళ్లంతా త‌లో మార్పు చెప్పేస‌రికి.. టీమ్ రిపేర్ల‌కు దిగి. ఏకంగా స‌గం సినిమాని రీషూట్ చేశార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. ఈసినిమా కోసం సందీప్ కిష‌న్ మూడు నెల‌లు క‌ష్ట‌ప‌డి మ‌రీ సిక్స్ ప్యాక్ చేశాడు. ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ని సందీప్‌పై తెర‌కెక్కించారు. ఆ ఫైట్ కూడా మార్పులూ, చేర్పుల కార్య‌క్ర‌మంలో ఎగిరిపోయింద‌ట‌. అలా సందీప్ కిష‌న్ మూడు నెల‌ల శ్ర‌మ వృథా అయిపోయింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.