English | Telugu

సుందరకాండ మూవీ ఫస్ట్ రివ్యూ!

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్.. ఈ ఏడాది ఇప్పటికే 'భైరవం' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. వినాయక చవితి కానుకగా రేపు(ఆగస్టు 27) 'సుందరకాండ'తో థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

నారా రోహిత్ కెరీర్ లో 'సోలో', 'జో అచ్యుతానంద' వంటి రొమాంటిక్ కామెడీ ఫిలిమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా 'సోలో' మూవీ రోహిత్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు 'సుందరకాండ' ప్రచార చిత్రాల్లోనూ ఆ వైబ్ కనిపించింది. అందుకు తగ్గట్టే సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గా ఉంది. ఇండస్ట్రీ సర్కిల్స్ లోనూ సినిమా గురించి పాజిటివ్ గా చెబుతున్నారు. పెళ్ళి కాని ప్రసాద్‌ తరహా పాత్రలో రోహిత్ చక్కగా ఒదిగిపోయాడట. నరేష్, సత్య, అభినవ్ గోమఠంతో కలిసి నవ్వులు పూయించాడని అంటున్నారు. లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకునేలా ఉందట. రొమాన్స్, కామెడీనే కాదు.. ఎమోషన్ కూడా వర్కౌట్ అయిందని టాక్.

ఇటీవల కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే క్లీన్ ఎంటర్టైనర్స్ పెద్దగా రావట్లేదనే చెప్పాలి. 'సుందరకాండ' పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. ఆ లోటుని భర్తీ చేసే అవకాశముంది. మరి విడుదలకు ముందు ఇండస్ట్రీ వర్గాల్లో పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సుందరకాండ.. విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.