English | Telugu
నాన్నకు ప్రేమతో... సుక్కు కొత్త లాజిక్
Updated : Jan 21, 2016
నాన్నకు ప్రేమతో సినిమా చూస్తే... కాస్త కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తుంది. ప్రతీ సీనుకీ ఓ లాజిక్ ఉంటుంది. స్వతహాగా లెక్కల మాస్టారైన సుకుమార్.... ఈ సినిమానీ లెక్కల సూత్రాల్లానే తీశాడు. సినిమా అంతా చూసొచ్చాక ఆ సీన్ అలా ఉందేంటి? ఈ సీన్ ఇలా తీశాడేంటి? అనే డౌట్లొస్తాయి. వీటిపై సుక్కు క్లారిటీ ఇచ్చాడు. `అసలు లాజిక్‌ల్ని లాజిక్కులుగానే చూస్తే.. ఏ సినిమా లాజిక్‌కి అందకుండా పోతుంది` అంటూ కొత్త లాజిక్ తీశాడు.
తాను ప్రతీ సీను చాలా క్లారిటీగా, క్లియర్ కట్‌గా తీశానని, అందరికీ అర్థమయ్యిందనే అనుకొంటున్నానని చెప్పుకొచ్చాడు. చుట్టూ మనకు నచ్చిన మనుషులుంటే... ఎక్కడో ఓ చోట తీర్చుకోవాల్సిన ఎమోషన్ మరోచోట బయటపెట్టొచ్చని అన్నాడు. కొన్ని కొన్ని సంఘటనలు నిజ జీవితంలో సాధ్యం అవ్వవని.. అందుకే తాను సినిమాల్లో చూపించనానని అంటున్నాడు. అలాంటి సన్నివేశాలకు లాజిక్ తీయకూడదని, సినిమాని సినిమాలా చూస్తే తప్పకుండా అర్థమవుతుందని.. ప్రేక్షకులకే క్లాస్ పీకాడు ఈ లెక్కల మాస్టారు.