English | Telugu

కాపీ కొట్టి కోట్లు సంపాదిస్తున్నాడు

ఈ రోజుల్లో సేల్ బుల్ ఐడియా దొరికితే చాలు. అది సొంత‌మా? ఎక్క‌డ్నుంచైనా కాపీ కొట్టాడా అన్న‌ది అన‌వ‌స‌రం. ఈమ‌ధ్య కాలంలో భారీ హిట్ల‌యిన సినిమాల్నీ దాదాపుగా అక్క‌డ్నుంచో, ఇక్క‌డ్నుంచో కాపీ కొట్టి ఎత్తేసిన‌వే. అంతెందుకు ఆఖ‌రికి బాహుబ‌లికీ కాపీ మ‌ర‌క అంటింది. శ్రీ‌మంతుడు క‌థ నాదే అని ఒక‌రు మీడియాకెక్కారు.

అఖిల్ మూవీ బేస్ లైన్ కూడా ఓ హాలీవుడ్ సినిమాకి ఇన్సిప్రేష‌న్ అన‌బ‌డే కాపీ. భ‌జ‌రంగీ భాయ్ జాన్ సినిమా.. ప‌సివాడి ప్రాణం నుంచి స్ఫూర్తి పొందిందే. ఇప్పుడు కుమారి 21 ఎఫ్‌కీ కాపీ మ‌ర‌క అంటింది. గ‌ళ్ నెక్ట్స్ డోర్ అనే ఇంగ్లీష్ సినిమా నుంచి సుక్కు లైన్ ఎత్తేశాడు. అదొక్క‌టేనా అంటే ఇంకా ఉంది. ప‌తాక సన్నివేశాల్ని అర్జెంటీనా మూవీ సీక్రెట్ ఇన్ డెయిర్ ఐస్ అనే సినిమా నుంచి సుక్కు కాపీ కొట్టాడ‌ట‌. లీలా డిట్ కా అనే ఫ్రెంచ్ మూవీ నుంచి కూడా సుక్కు కొన్ని సీన్లు ఎత్తేశాడ‌ట‌.

ఏదైతేనేం... ఇవ‌న్నీ క‌లిసి ఓ కిచిడీ వండాడు సుకుమార్‌. దానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మర‌థం ప‌డుతున్నారు. తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌లో ప‌డిపోయింది. సోమ‌వారం నుంచి వ‌చ్చింద‌తా లాభ‌మే. మొత్తంగా సుకుమార్ ఈ సినిమా నుంచి దాదాపుగా 5 కోట్ల లాభాన్ని ఆర్జించే అవ‌కాశం ఉంద‌న్న‌ది లేటెస్ట్ టాక్‌. అంటే కాపీ క‌థ‌కు 5 కోట్లు ఆర్జిస్తున్నాడ‌న్న‌మాట‌. అంత‌కంటే ఏం కావాలి?

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.