English | Telugu

‘సుజిత్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’పై సుజీత్‌ క్లారిటీ.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌!

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌కి ఒక సాలిడ్‌ హిట్‌ పడి చాలా కాలమైంది. ఆకలితో ఉన్న పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కి ఫుల్‌ మీల్స్‌ లాంటి సినిమాగా వచ్చింది ‘ఓజీ’. ఒకరోజు ముందు నుంచే మొదలైన ఫ్యాన్స్‌ సందడి షో పూర్తయిన తర్వాత తారా స్థాయికి చేరుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఓజీ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. పవన్‌ని ఫ్యాన్స్‌ ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి కంటెంట్‌తో, అలాంటి ఎలివేషన్స్‌తో థియేటర్స్‌ దద్దరిల్లిపోతున్నాయి. ఈ సినిమా రిలీజ్‌ సందర్భంగా డైరెక్టర్‌ సుజీత్‌ పెట్టిన ట్వీట్‌ ఇప్పుడు సంచలనంగా మారింది. ‘సుజీత్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’పై సుజీత్‌ ఇచ్చిన క్లారిటీ పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

‘ఎన్నో సంవత్సరాల ఈ ప్రయాణం చివరకు ముగిసింది. నాకు, నా ఫ్యామిలీకి ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. నా డైరెక్షన్‌ టీమ్‌కి, నా టెక్నీషియన్స్‌కి ఐలవ్‌యు చెప్తున్నాను. నా ఆనందాన్ని ఇంతకంటే బాగా చెప్పలేను. నాకు మొదటి నుంచీ మంచి సపోర్ట్‌ ఇచ్చిన నిర్మాతలు దానయ్యగారికి, కళ్యాణ్‌ గారికి కృతజ్ఞతలు. నాకు మంచి సపోర్ట్‌గా ఉండి తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చిన థమన్‌ అన్నకు థాంక్స్‌. నవీన్‌ నూలి, రవి కె.చంద్రన్‌ సర్‌, మనోజ్‌ పరమహంస సర్‌.. మీ పార్టిసిపేషన్‌ ఎక్స్‌ట్రార్డినరీ. మీ అందరి కృషితో సినిమా ఒక రేంజ్‌కి వెళ్లిపోయింది. ఈరోజు మీరు చూపిస్తున్న ప్రేమ, మ్యాడ్‌ నెస్‌ నేను ఊహించలేనిది. సినిమా చూడండి, సెలబ్రేట్‌ చేసుకోండి, ఎంజాయ్‌ చేయండి. గుర్తుపెట్టుకోండి.. ఇది ఆరంభం మాత్రమే. అన్నీ సరిగ్గా కుదిరితే ఓజీ ప్రపంచం ఇక్కడి నుండి మరింత పెద్దదిగా మారుతుంది. లవ్‌ యు మై పవర్‌ స్టార్‌’

ఈ పోస్ట్‌తో సుజిత్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌కి ప్లానింగ్‌ జరుగుతోందని తెలుస్తోంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ పోస్ట్‌ను హైలైల్‌ చేస్తూ పెట్టడంతో ‘సుజీత్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’ ఉంటుందని అందరికీ క్లారిటీ వచ్చింది. ఏది ఏమైనా టాలీవుడ్‌లో ఒక కొత్త ప్రపంచానికి శ్రీకారం చుట్టారు పవన్‌కళ్యాణ్‌, సుజీత్‌. దీంతో తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగిందని చెప్పాలి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.