English | Telugu

సుధీర్ బాబుకు అమ్మాయిలు మెసేజ్ చేస్తున్నారట..!

మహేష్ బావగా సినీ రంగంలోకి ఎంటరైనా, కష్టపడి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు సుధీర్ బాబు. ప్రస్తుతం హిందీ బాఘీలో విలన్ గా మంచి పేరు సంపాదించుకున్న సుధీర్, తెలుగులో కూడా ఏమాయ చేశావేలో హీరోయిన్ అన్నయ్యగా విలన్ షేడ్ లోనే ఎంటరవ్వడం విశేషం. తెలుగులో ప్రేమకథాచిత్రమ్ సుధీర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. భలే మంచి రోజు సినిమా కూడా ఫర్వాలేదనిపించుకుంది. లేటెస్ట్ గా బాఘీ సినిమా చేసిన తర్వాత బాలీవుడ్ లో చాలా ఆఫర్స్ వస్తున్నాయంటున్నాడీ కుర్రహీరో. కానీ ఏది పడితే అది ఒప్పుకోకుండా, మంచి పాత్రలకే ప్రిఫరెన్స్ ఇస్తానంటున్నాడు. " విలన్ క్యారెక్టర్ ఫ్యామిలీలకు అమ్మాయిలకు నచ్చదేమో అనుకున్నా. కానీ ఎక్కువగా వాళ్లే నాకు మెసేజ్ లు పెడుతున్నారు. మంచి పాత్ర అయితే తెలుగులో కూడా విలన్ గా చేయడానికి నేను రెడీ " అంటున్నాడు సుధీర్ బాబు. ప్రస్తుతం సుధీర్ చేతిలో తెలుగులో ఒక ప్రాజెక్ట్, పుల్లెల గోపీచంద్ బయోపిక్ సినిమాలు ఉన్నాయి. గతంలో మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సుధీర్ వ్యక్తిగతంగా కూడా గోపీచంద్ కు మంచి మిత్రుడవడం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.