English | Telugu
ఊహించని కథతో ssmb 29.. మహేష్ ఫ్యాన్స్ రియాక్షన్!
Updated : Jul 24, 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి(SsRajamouli)ల పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ssmb29 '(వర్కింగ్ టైటిల్) ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతుండగా, అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి స్టిల్స్ బయటకి రాలేదు. దీన్ని బట్టి రాజమౌళి ఎంత పకడ్బందీగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. ప్రియాంక చోప్రా(Priyanka Chopra)హీరోయిన్ గా చేస్తుండగా, మలయాళ స్టార్ హీరో 'పృథ్వీరాజ్ సుకుమారన్'(Prithviraj Sukumaran)కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ పై కొన్ని సన్నివేశాలని కూడా చిత్రీకరించడం జరిగింది.
రీసెంట్ గా పృథ్వీ రాజ్ సుకుమారన్ తన అప్ కమింగ్ మూవీ 'సర్జమీన్' ప్రమోషన్స్ లో 'ssmb29 'గురించి మాట్లాడుతు 'రాజమౌళి సార్ ఎంచుకునే కథలన్నీ భారీగానే ఉంటాయి. ఎవరు ఊహించని కథతో రాజమౌళి, మహేష్ సినిమా ఉండబోతుంది. ప్రతి ఒక్కర్ని అలరించేలా కథని చెప్పడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. ఒక అద్భుత దృశ్య కావ్యం. విజువల్ ట్రీట్ గా కూడా భారీ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని చెప్పుకొచ్చాడు.
ఇక చిత్ర యూనిట్ తమ తదుపరి షెడ్యూల్ ని 'కెన్యా'(Kenya)దేశంలోని ప్రాముఖ్యత గల 'అంబోసెలి నేషనల్ పార్క్' లో ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్ లో మహేష్ తో పాటు హీరోయిన్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ పాల్గొనాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కెన్యాలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా షూటింగ్ ని వాయిదా వేసినట్టుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. పలువురు విదేశీ నటులు కూడా ssmb 29 లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని నిర్మించిన దుర్గా ఆర్ట్స్ అధినేత కె ఎల్ నారాయణ(Kl Narayana) నిర్మాత.