English | Telugu
ssmb 29 కోసం ప్రభాస్ హీరోయిన్ ని మహేష్ దించబోతున్నాడా! ఓ స్త్రీ రేపు రా
Updated : May 26, 2025
ssmb 29 పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీని, రాజమౌళి(Ss Rajamouli)తన గత చిత్రాలకి మించి హిట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే మూవీకి సంబంధించిన ప్రతి విషయంలోను ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో లీక్ ల బెడద ఎక్కువ కావడంతో ఫస్ట్ టైం పబ్లిసిటీకి కూడా దూరంగా ఉంటున్నాడు దీన్ని బట్టి ఈ మూవీ ప్రత్యేకతని అర్ధం చేసుకోవచ్చు.
ఈ మూవీలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra)హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ లో మహేష్(Mahesh babu)ప్రియాంక పై కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. లేటెస్ట్ గా ఇండియన్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం, మరో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దాకపూర్ ssmb 29 లో చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ కాస్టింగ్ కోసం కాకుండా, కథ డిమాండ్ ప్రకారమే శ్రద్ధకపూర్ ని ssmb 29 లో మేకర్స్ భాగస్వామ్యం చెయ్యబోతున్నారని కూడా అంటున్నారు. దీంతో శ్రద్ధ కపూర్ చెయ్యడం నిజమైతే కనుక, ఆమె ఎలాంటి క్యారక్టర్ లో కనిపిస్తుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.
ఎందుకంటే శ్రద్ధ కపూర్(Shraddha Kapoor)ఇప్పటికే బాలీవుడ్ లో అనేక హిట్ చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ప్రభాస్ తో కలిసి చేసిన సాహో,స్త్రీ 2 తో పాన్ ఇండియా స్థాయిలో అభిమానుల్ని సంపాదించింది. ఈ నేపథ్యంలో శ్రద్ధ కపూర్ ssmb 29 లో నటించడం ఖాయమైతే మూవీకి అదనపు క్రేజ్ వచ్చినట్టే. దుర్గ ఆర్ట్స్ పై సీనియర్ ప్రొడ్యూసర్ కె ఎల్ నారాయణ ssmb 29 ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. పృథ్వీ రాజ్ సుకుమారన్ తో పాటు పలు విదేశీ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, 2027 ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.