English | Telugu

వాస్తవంలోకి రావమ్మా శ్రీదేవి!

ఐదుపదులు దాటినా ఇంకా హీరోయిన్ లానే కనిపించాలంటే కుదురుతుందా? కానీ శ్రీదేవికి ఆ పాకులాట ఏమాత్రం తగ్గలేదు. ముసలైపోయినా ఇంకా తాపత్రయం పోలేదు. దట్టంగా మేకప్, కైపెక్కించే డ్రస్సులు వేసుకుని తెగ రెచ్చిపోతోంది. రీఎంట్రీలో ఆఫర్ రావడమే ఎక్కువనుకుంటే..శ్రీదేవికి ఉండే ఫాలోయింగ్ రీత్యా అదేమంత పెద్ద కష్టం కాదనుకున్నారు. కానీ వచ్చిన ఛాన్సులను కూడా వదులుకుని తప్పుచేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

విడుదలకు సిద్ధంగా ఉన్న బాహుబలిలో శివగామి పాత్రకోసం ముందుగా అమ్మడినే సంప్రదించారు. కానీ కాసులుకోసం కాస్త అతిగా కక్కుర్తిపడిన శ్రీదేవి ఆ ఛాన్స్ వదులుకుంది. ఎంచక్కా రమ్యకృష్ణ ఆ పాత్రలో నటవిశ్వరూపం ప్రదర్శించిందని చెబుతున్నారు. అటు కోలీవుడ్ పులిమూవీలో మాత్రం మహారాణి పాత్రకోసం సై అంది.

ఆ లుక్ చూస్తుంటే శ్రీదేవి అసహ్యంగా కనిపిస్తోంది. పైగా జనాలంతా ముసలి సుందరిని పట్టుకుని అతిలోకసుందరి అని తెగ ఊదరగొడుతున్నారు. ఏదేమైనా కాస్త బలుపుతగ్గించుకుని హుందాగా ప్రవర్తిస్తే...రీఎంట్రీలో శ్రీదేవికి ధీటుగా ఎవ్వరూ నిలబడలేరన్నది వాస్తవం. మరి ఈ విషయం ఆమె ఎప్పుడు గ్రహిస్తుందో ఏమో?

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.