English | Telugu

సినీ శ్రీరాములు వీళ్లే..!

శ్రీరామచంద్రుడు..రాముడిని చూసినా, ఆయన గురించి విన్నా జనం తమను తాము మైమరిచిపోతారు. మనిషిలోని వివిధ లక్షణాలకు రాముడిని పోల్చి చూస్తారు మన పెద్దలు. జీవితంలోని ప్రతి జీవన సన్నివేశంలో రామాయణాన్ని ఉదాహరణగా చెబుతూ రావడం అలవాటు. ఓ భర్తగా రాముడ్ని చూసి నేర్చుకోమంటారు, తమ్ముళ్లకి అన్న ఎలా ఉండాలో, రాజుగా ప్రజల్ని ఎలా పాలించాలో చిన్నతనం నుంచే ఉగ్గుపాలతో నూరిపోస్తారు. పౌరాణికాలు తీయడంలో తెలుగువారు సిద్ధహస్తులు. మూకీ నుంచి టాకీ వరకు, 30ఎంఎం నుంచి 70 ఎంఎం వరకు పౌరాణికాల్లో మనల్ని కొట్టే వాళ్లే లేరు. మరి రాముడంతటి ప్రేమమూర్తిని వెండితెరపై ఆవిష్కరించకుండా ఉంటారా. అందుకే సి.పుల్లయ్య నుంచి బాపు వరకు రాముణ్ణి తెరపై ఆవిష్కరించారు. మరి సకలగుణాభిరాముడిని తెరపై తనలో చూపట్టే నటులకు ఎంతటి ప్రతిభ ఉండాలో కదా. చాలా మంది నటులు తెరపై రాముడిని చూపించారు. అలాంటి వారి గురించి మీ కోసం..

1 ఎన్టీఆర్

ఆహా..ఏమి రామరూపమది..అంటూ ప్రేక్షకులు మైమరచిపోవడానికి ఎన్టీఆరే కారణం. తెలుగువారికి రాముడంటే రామారావే. ఆయన ముగ్థమనోహర రూపం, నటన ప్రేక్షకులకు రాముడంటే ఇలాగే ఉంటాడా? అనిపించేటట్లు సమ్మోహన పరిచారు ఎన్టీఆర్. ఆయన తొలిలసారి చరణదాసి అనే చిత్రంలో రాముడి గేటప్ వేశారు. ఆ తర్వాత 1963లో విడుదలైన లవకుశ ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. ఆయన నటనకు ముగ్ధులైన నాటి జనం సినిమా చూడటం కోసం ఎండ్లబండ్లు కట్టుకుని వెళ్లారట. దానితో పాటు శ్రీకృష్ణసత్య, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం చిత్రాల్లో ఆయన రామావతరం దాల్చారు. నాటికి నేటికి ఏనాటికి తెలుగువారి దృష్టిలో శ్రీరాముడి గెటప్‌కి బ్రాండ్ అంబాసిడర్ నందమూరి తారకరామారావే.

2 హరనాథ్


శ్రీరాముడంటే అచ్చం ఎన్టీఆర్‌లా ఉంటారు అని జనం అన్నగారికి నీరాజనాలు పడుతున్న సమయంలో శ్రీరాముడి వేషం వెయ్యాలంటే ఎంత డేర్ కావాలి. మరి అలాంటి ఎన్టీ‌ఆర్‌కు సైతం పోటీ ఇచ్చిన నటుడు హరనాథ్. స్వయంగా ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా సీతారామకళ్యాణంలో శ్రీరాముడి పాత్ర పోషించారు హరనాథ్.

3శోభన్‌బాబు

ఫ్యామిలీ హీరోగా స్టార్ ఇమేజ్‌లో ఉన్న ఆంధ్రా సోగ్గాడు శోభన్‌బాబు. వరుసగా కుటుంబ కథ చిత్రాల్లో నటిస్తున్న ఆయన తాను కూడా శ్రీరాముడి గెటప్‌కి సెట్ అవుతానని ప్రూవ్ చేశారు. బాపు దర్శకత్వంలో వచ్చిన సంపూర్ణ రామాయణంలో శ్రీరాముని పాత్రలో ఒదిగిపోయాడు. రామయ తండ్రీ..ఓ రామయ తండ్రి అంటూ తెలుగు ప్రేక్షకుల్ని భక్తిరసంలో ఓలలాడించారు.

4 కృష్ణ

ఆంధ్రా జేమ్స్ బాండ్‌గా యాక్షన్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వెలుగొందుతున్నకాలంలో సూపర్ స్టార్ కృష్ణ శ్రీరాముడి గెటప్ వేశారు. కృష్ణ సినీ జీవితంలోనే మైల్ స్టోన్‌గా చెప్పుకునే అల్లూరి సీతారామరాజు సినిమా క్లైమాక్స్‌లో కొద్దిసేపు రాముడిలా కనిపిస్తారు సూపర్ స్టార్.

5 సుమన్

హీరోగా సెకండ్ ఇన్నింగ్స్‌ చేస్తూ ఫేడ్అవుట్ అవుతున్న టైంలో సుమన్‌ని మళ్లీ జనంలో ఉంచాడు శ్రీరాముడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, కింగ్ నాగార్జున కాంభినేషన్‌లో తెరకెక్కిన సినిమా శ్రీరామదాసు. ఈ సినిమాలో శ్రీరాముడిగా సుమన్ అద్భుతమైన నటనను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పౌరాణిక క్యారెక్టర్లకు తాను ప్రత్యామ్నాయం అని నిరూపించారు.

6 బాలకృష్ణ

తండ్రి బాటలో వైవిధ్యమైన పాత్రలు పోషించాలన్నదే తన కోరిక అంటూ తరచూ చెప్పే బాలకృష్ణ చాలాసార్లు అలాంటి పాత్రలు పోషించారు. కాని రాముడు పాత్ర అనేసరికి ఎలా పండిస్తారో అని అభిమానులు భయపడిన వేళ బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యంలో రాముడి గెటప్‌ని అత్యద్భుతంగా పోషించి తాను తండ్రిని మించిన తనయుడిని అని ప్రూవ్ చేశారు బాలయ్య.

7 జూనియర్ ఎన్టీఆర్

తెలుగు నాట మహామహులే మేం చేయలేం బాబోయ్ అన్న శ్రీరాముడి పాత్రను అతి చిన్న వయసులోనే చేసి ఔరా అనిపించారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలో జూనియర్ బాల రాముడిగా ఆదరగొట్టారు. ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. తాతకు తగ్గ మనవడు అంటూ జూనియర్‌ని అంతా ప్రశంసించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.