English | Telugu

ఫిష్‌ వెంకట్‌ కుటుంబానికి సోనూ సూద్‌ ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?

తను చేసిన సినిమాల ద్వారా కంటే.. పలు రకాల సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎంతో దగ్గరైన నటుడు సోనూ సూద్‌. నార్త్‌, సౌత్‌ అనే తేడా లేకుండా ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందించి.. వారికి తగిన సాయం చేయడంలో సోనూ ఎప్పుడూ ముందుంటారని అందరికీ తెలుసు. ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో అతను చేసిన సాయాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. గత కొంతకాలంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఇటీవల తుది శ్వాస విడిచిన టాలీవుడ్‌ నటుడు ఫిష్‌ వెంకట్‌ కుటుంబానికి ఇప్పుడు సోనూ సూద్‌ అండగా నిలుస్తున్నారు. ఫిష్‌ వెంకట్‌ భార్యతో స్వయంగా మాట్లాడిన సోనూ.. వారి కుటుంబాన్ని ఆదుకుంటానని మాట ఇచ్చారు.

ఫిష్‌ వెంకట్‌ ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా అతని వైద్య ఖర్చుల కోసం పలుమార్లు ఆ కుటుంబం అర్థించింది. అయితే ఈ విషయంలో టాలీవుడ్‌ ప్రముఖులు తక్కువగానే స్పందించారని చెప్పాలి. అదే సమయంలో సోనూ సూద్‌ కిడ్నీ దాతల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. దాని కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా అతను సిద్ధపడ్డాడని, అయితే అది కార్యరూపం దాల్చలేదు. అంతేకాదు, ఫిష్‌ వెంకట్‌ కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు సోనూ. అయితే బ్యాంకు సమస్య వల్ల ఆ సాయం అనేది ఫిష్‌ వెంకట్‌ కుటుంబానికి చేరలేదు. తాజాగా సోనూ సూద్‌ స్వయంగా ఫిష్‌ వెంకట్‌ భార్యతో మాట్లాడారు. వారి కుటుంబానికి అండగా తాను ఉంటానని ఆమెకు ఫోన్‌ ద్వారా తెలియజేశారు. వెంకట్‌ తనకు తమ్ముడులాంటి వాడని, తక్షణ సాయంగా లక్ష రూపాయలు పంపిస్తానని చెప్పారు. దానికి సంబంధించిన బ్యాంక్‌ డీటైల్స్‌ అన్నీ సోనూ సూద్‌కు అతని పి.ఎ. పంపించారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.