English | Telugu

సోనాక్షి కోసం ప్ర‌భుదేవాని గోకుతున్న మెగా హీరో!

తెలుగులో హీరోయిన్ల‌కు య‌మా కోర‌తొచ్చేసింది. స్టార్ హీరోల ప‌క్క‌న కూడా క‌థానాయిక‌లు దొర‌క‌డం లేదు. అందుకే బాలీవుడ్ నుంచి దిగుమంతి చేసుకొంటున్నారంతా. కొంత‌మంది క‌థానాయిక‌లైతే మ‌రీ బెట్టు చేస్తున్నారు, పారితోషికం విష‌యంలో కొండెక్కేస్తున్నారు. సోనాక్షి సిన్హా కూడా అంతే. ద‌క్షిణాది సినిమాలంటే మ‌రీ డ‌బుల్, త్రిబుల్ రెమ్యున‌రేష‌న్ అడుగుతోంద‌ట‌. లింగ తో సౌత్ ఇండియాలో కాలు పెడుతోంది సోనాక్షి. ''అవ‌కాశం వ‌స్తే తెలుగులోనూ న‌టిస్తా'' అంటూ చాటింపేసింది. దాంతో రామ్‌చ‌ర‌ణ్ ఎలాగైనా స‌రే సోనాక్షిని త‌న సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాల‌ని గ‌ట్టిగా ఫిక్స‌యిపోయాడ‌ట‌. నోరు తెరిచి అడిగితే చీప్ అయిపోతామ‌ని.. ప్ర‌భుదేవాని ప‌ట్టుకోబోతున్నాడు. చ‌ర‌ణ్ - శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్ లో ఓ సినిమా మొద‌ల‌వుతోంది. ఈ సినిమాలో క‌థానాయిక‌గా సోనాక్షిని ఎంచుకోవాల‌న్న ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇందుకోసం ప్ర‌భుదేవాని గోకుతున్నాడు చ‌ర‌ణ్‌. ఆయ‌న్నే ఎందుకంటే సోనాక్షికీ ప్ర‌భుదేవాకి మ‌ధ్య మంచి అండ‌ర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. సోనాక్షి తో మూడు సినిమాలు తీసిన అనుభ‌వం ఉంది ప్ర‌భుదేవాకు. అందుకే ప్ర‌భుదేవా మాట సోనాక్షి కాద‌న‌ద‌నే న‌మ్మ‌కం. సో... ప్ర‌భుదేవాని ప‌ట్టుకొంటే ప‌నైపోతుంద‌ని అటు శ్రీనువైట్ల కూడా భావిస్తున్నాడ‌ట‌. సోనాక్షి పారితోషికం ఎంత అడిగినా ఇవ్వ‌డానికి కూడా రెడీ అయిపోయారు. సో.. సోనాక్షి వ‌ల‌లో ప‌డ‌డ‌మే త‌రువాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.