English | Telugu

పిచ్చి ఆనందాన్ని పొందటం అలవాటు అయిపోయింది

మెగాస్టార్ చిరంజీవి(Chinranjeevi)రీసెంట్ గా జరిగిన 'బ్రహ్మా ఆనందం'(Brahma anandham)ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయిన విషయం తెలిసిందే.అందులో ఆయన మాట్లాడుతు'తన కొడుకు చరణ్(Charan)తో ఈ సారి మగపిల్లాడుని కనీ,మన లెగసి ని కంటిన్యూ చేసే వారసుడ్ని ఇవ్వరా అని అడిగాను.ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువయ్యారు లేడీస్ హాస్టల్ కి వార్డెన్ గా ఉన్నట్టుందని తనదైన స్టైల్లో చమత్కరించాడు.దీంతో చిరు చేసిన వ్యాఖ్యలు మహిళలని అవమానించేలా ఉన్నాయని,సోషల్ మీడియా వేదికగా కొంత మంది చిరుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

దీంతో టాక్సీవాలా, బేబీ వంటి పలు విజయవంతమైన చిత్రాలని నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్(Skn)'ఎక్స్' వేదికగా స్పందిస్తు కొంత మంది కావాలని చిరంజీవి గారిపై కామెంట్స్ చేస్తున్నారు.పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపిన తర్వాత కూడా ఆడపిల్లలకి తన ఆస్తిని పంచి ఇచ్చిన గొప్ప మనసు ఆయనది.నిజమైన ఫ్యామిలీ మాన్.ఎవరిని ఏమి అనని మనిషి కదా అని ఆయన మీద అవాకులు చెవాకులు పేల్చి అనవసర రాద్ధాంతం చేసి పిచ్చి ఆనందం పొందటం కొందరకి అలవాటు అయిపోయిందని చెప్పుకొచ్చాడు.