English | Telugu

టాలీవుడ్‌ టాప్‌ హీరోతో ‘సింగిల్‌’ కార్తీక్‌రాజు భారీ ప్రాజెక్ట్‌!

టాలీవుడ్‌ టాప్‌ హీరోతో ‘సింగిల్‌’ కార్తీక్‌రాజు భారీ ప్రాజెక్ట్‌!

కార్తీక్‌రాజు...ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రిలీజ్‌ అయిన సింగిల్‌ సినిమాతో డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇది ఫిలిం నగర్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కార్తీక్‌రాజు తమిళ సినిమా ప్రయాణం విజయ్‌ సేతుపతి నటించిన ‘తిరుదన్‌ పోలీస్‌’ సినిమా విజయంతో ప్రారంభమైంది. ఆ తర్వాత  ‘ఉల్కుతు’, రెజీనా కాసాండ్రా నటించిన ద్విభాషా చిత్రం ‘నేనే నా’తో తన విజయ పరంపరను కొనసాగించారు. ఇక సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమై మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించారు. ఇక రీసెంట్‌గా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ బేనర్లో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ‘సింగిల్‌’ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించడంతో టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన దర్శకులలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ‘నిను వీడని నీడను నేనే’, ‘సింగిల్‌’ వంటి వరుస హిట్‌లతో కార్తీక్‌ రాజు పరిశ్రమలో తన సత్తా నిరూపించుకున్నారు. 

‘సింగిల్‌’ సినిమా విజయం తర్వాత ప్రముఖ హీరోలతో కొత్త ప్రాజెక్టుల కోసం అగ్ర నిర్మాణ సంస్థలు కార్తీక్‌రాజును సంప్రదిస్తున్నాయని తెలుస్తోంది. ప్రముఖ హీరోతో భారీ బడ్జెట్‌ ప్రాజెక్ట్‌ కోసం ఆయన టాప్‌ మోస్ట్‌ బ్యానర్‌తో కలిసి పనిచేయబోతున్నారు. త్వరలో ఆ ప్రాజెక్ట్‌ వివరాలు వెల్లడిరచనున్నారు. కార్తిక్‌రాజు తన విజన్‌ మరియు డిఫరెంట్‌ మేకింగ్‌ స్టైల్‌తో భవిష్యత్తులో మరిన్ని బ్లాక్‌బస్టర్‌ హిట్‌లను సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతిభ, అంకితభావంతో కార్తిక్‌ రాజు భారతీయ చలనచిత్ర పరిశ్రమపై శాశ్వత ప్రభావాన్ని చూపిస్తారనడంలో సందేహం లేదు.