English | Telugu
కమల్ హాసన్ పై శృతి హాసన్ కీలక వ్యాఖ్యలు.. కూతురంటే నీలాగే ఉండాలి
Updated : Oct 27, 2025
అగ్రహీరోలకి మోస్ట్ లక్కీయస్ట్ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు 'కమల్ హాసన్'(Kamal Haasan)నట వారసురాలు 'శ్రుతిహాసన్'(Shruthi Haasan). ఆయా హీరోల అభిమానులు కూడా తమ హీరోకి జోడిగా శృతి హాసన్ ఉండాలని కోరుకుంటు ఉంటారు. ఆమెకున్న హిట్ ట్రాక్ అలాంటిది. ఈ ఏడాది ఆగష్టులో 'కూలీ'(Coolie)తో పలరించిన శృతి హాసన్ ప్రస్తుతం విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో 'ట్రైన్'(Traine)అనే విభిన్న జోనర్ కి సంబంధించిన మూవీ చేస్తుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
రీసెంట్ గా శృతిహాసన్ ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు నా నటనని మా నాన్న నటనతో కంపార్ చేస్తుంటారు. అలా పోల్చడం వల్ల నేనెప్పుడు ఇబ్బంది పడలేదు. పైగా అలా పోల్చుతూ ఉన్నారంటే మా నాన్న నాతో ఉన్నట్లే కదా. జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఆయన నుంచే నేర్చుకున్నాను. నాన్న తన సొంత డబ్బుతో సినిమా తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తన పని తాను చేసుకుంటు వెళ్తారే కానీ బాక్స్ ఆఫ్ ఆఫీస్ నంబర్స్ గురించి ఆలోచించరు. అందుకే బాక్స్ ఆఫీస్ నంబర్స్ నాన్నని ప్రభావితం చేయలేవని శృతి హాసన్ చెప్పుకొచ్చింది.
కమల్ హాసన్ గత కొంత కాలంగా వరుస పరాజయాల్ని ఎదుర్కొంటున్నాడు. లెజండ్రీ డైరెక్టర్ మణిరత్నం(Manirathnam)తో కలిసి ఎన్నో ఆశలతో చేసిన గత చిత్రం థగ్ లైఫ్ కూడా భారీ డిజాస్టర్ ని అందుకుంది. ఈ చిత్రానికి కమల్ హాసన్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. జూన్ 5 న థియేటర్స్ లోకి రాగా సుమారు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. కనీసం 100 కోట్లని కూడా రాబట్ట లేదు. ఈ చిత్రానికి ముందు ఇండియన్ 2 కూడా భారీ డిజాస్టర్ ని చవి చూసింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ గురించి శృతి హాసన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. 2022 లో వచ్చిన విక్రమ్ తర్వాత కమల్ ఖాతాలో మరో హిట్ లేదు.