English | Telugu

శనివారం రిలీజ్ కానున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ' జల్లు '..!

ప్రసాద్ ప్రివ్యూ ల్యాబ్స్ లో షార్ట్ ఫిల్మ్ జల్లు ప్రీమియర్ షో ప్రదర్శించారు. ప్రివ్యూకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రఖ్యాత నటుడు హర్షవర్ధన్, ' టెర్రర్ ' దర్శకుడు సతీష్ కాశెట్టి హాజరై ప్రివ్యూ చూశారు. తొలి ప్రయత్నమైనా, ఫీచర్ ఫిల్మ్ కు ఏమాత్రం తగ్గకుండా, తెరకెక్కించారని అల్లు అరవింద్ ప్రశంసించారు.

సినిమా అద్భుతంగా ఉందని, ఈ టీం అందరూ మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నానని హర్షవర్ధన్ అన్నారు. టీం అంతా కొత్త వాళ్లైనా, వాళ్లకు సపోర్ట్ ఇచ్చి సినిమాలో కూడా కీలక పాత్ర పోషించారు ప్రఖ్యాత నటుడు సమీర్. ఆయన ఇచ్చిన సపోర్ట్ తమకు చాలా బలాన్నిచ్చిందంటోంది మూవీ టీం. మంత్ర లాంటి సెన్సేషనల్ మూవీకి సంగీతాన్నందించిన ఆనంద్ ' జల్లు 'కు కూడా ఫీల్ గుడ్ మ్యూజిక్ ను అందించడం విశేషం.జల్లులో మరో విశేషం సంజయ్ రాయచూర. ఆయన ఇప్పటి వరకూ నటుడిగా తెరమీద చాలాసార్లు కనిపించినా, తెరవెనుక సినిమాటోగ్రఫర్ ఈ సినిమాకు పనిచేసి, తొలి ప్రయత్నంలోనే మంచి విజువల్ గా మూవీని తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. సమీర్ , విజయ్, మౌనిక, చైతన్య ముఖ్య పాత్రల్లో చైతన్య శ్రీపెరంబుదూర్ దర్శకత్వంలో తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ జల్లు. ఫీచర్ ఫిల్మ్ స్థాయిలో తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్ లో ఈ శనివారం రీలీజ్ చేయనున్నారు.

నటీనటులు : సమీర్, విజయ్, మౌనిక, చైతన్య, సుజన్, దివ్య
మ్యూజిక్ : మంత్రా ఆనంద్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : ధ్రితిన్
డి.ఒ.పి : సంజయ్ రాయ్ చూర్
దర్శకత్వం : చైతన్య శ్రీపెరంబుదూర్

మరిన్ని ఫోటోల కోసం కింద క్లిక్ చేయండి..

http://teluguone.com/photos/picture/jallu-telugu-short-film-premiere-show-10-5865-17102.html

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.