English | Telugu

Shekhar home Review: శేఖర్ హోమ్ వెబ్ సిరీస్ రివ్యూ

Shekhar home Review: శేఖర్ హోమ్ వెబ్ సిరీస్ రివ్యూ


వెబ్ సిరీస్ : శేఖర్ హోమ్
నటీనటులు: కేకే మీనన్, రణ్ వీర్ షోరే , రసిక దుగల్ , కీర్తీ కుల్హారీ, షెర్నాజ్ పటేల్,  కౌశిక్ షేన్, సలీమ్ సిద్దిఖీ తదితరులు
రచన : అనిరుద్ధ గుహ
ఎడిటింగ్:  సౌరభ్ ప్రభుదేశాయ్
మ్యూజిక్: జోయల్ క్రాస్టో
నిర్మాతలు : సమీర్ గోగతే
దర్శకత్వం: శ్రీజిత్ ముఖర్జీ, రోహన్‌ సిప్పీ
ఓటీటీ: జియో సినిమా

కథ:

అర్థరాత్రి ఇద్దరు పోలీసులు నైట్ డ్యూటీ చేస్తుంటారు. అందులో ఒకతను కాస్త దూరం వచ్చి చూసి షాకై.. మరో పోలీస్ ని పిలుస్తాడు‌. ఇక కథ పన్నెండ గంటల వెనెక్కి వెళ్తుంది. కాషా బ్లాన్సర్ అనే హోటల్ కి  జయవ్రత్ షైనీ(రణ్ వీర్ షోరే) వస్తాడు. ఇక ఆ హోటల్ యజమాని  మిస్సెస్ హెచ్ తనకి ఓ రూమ్ కి అద్దెకి ఇస్తుంది. అదే శేఖర్(కేకే మీనన్). ఇక మిస్సెస్ హెచ్ కింద పనిచేసే బిట్టు అనే వ్యక్తి జయవ్రత్ షైనీ కి తన గదిని చూపిస్తాడు. అయితే ఆ గది తాళం శేఖర్ దగ్గరే ఉండటంతో అతన్ని వెతుక్కుంటూ జయవ్రత్ షైనీ, బిట్టు వెళ్తారు. ఇక రిక్షా నడుపుతూ తప్పిపోయిన మేకని శేఖర్ కనిపెట్టడంతో అది చూసిన జయవ్రత్ షైనీ ఇంప్రెస్ అవుతాడు. అయితే మరుసటి రోజు ఉదయం శేఖర్ దగ్గరికి  ఓ పోలీస్ వచ్చి‌‌.. మర్డర్ జరిగిందని ఇన్వెస్టిగేషన్ చేయాలని సహకరించమంటాడు. దాంతో శేఖర్ సరేనని కేసుని సాల్వ్ చేస్తాడు. శేఖర్ హోమ్ ఎవరు? ప్రాజెక్టు ఎమ్ ఎవరు? అసలు జయవ్రత్ షైనీకి శేఖర్ హోమ్ కి గల సంబంధం ఏంటనేది మిగతా కథ.

విశ్లేషణ:

కేకే మీనన్ కథా ఎంపికే భిన్నంగా ఉంటుంది‌. రైల్వే మెన్ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన కేకే నటించిన ఈ ' శేఖర్ హోమ్ '.. సూపర్ ట్విస్ట్ లతో సాగుతుంది. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో క్రైమ్ ఇన్వెస్టిగేషన్.. ప్రతీ క్రైమ్ ని ఇన్వెస్టిగేషన్ చేసిన తీరు చివరు వరకు చూసేలా చేస్తుంది.

కథలో ఆరు ఎపిసోడ్‌లు ఉంటాయి. అవి మారుతున్న కొద్ది ప్రదేశాలు, కేసులు మారుతుంటాయి. అయితే ఆ ఎపిసోడ్ లో క్యారెక్టర్లు కూడా ఎక్కువగా ఉండకుండా .. ఫస్ట్ నుండి చివరి వరకు ఓ అరడజను పాత్రలే ఉంటాయి. కథా వస్తువుగా క్రైమ్  ఇన్వెస్టిగేషన్ తీసుకున్నాడు దర్శకుడు. ఇందులో క్రైమ్ వివరించే ప్యాట్రన్.. హీరో ఇంటలిజెన్స్.. విలన్ ఎవరా అని సాగే సస్పెన్స్ సిరీస్ ని స్కిప్ చేయనీయవు. 

ఆయితే ఇందులో అడల్ట్ సీన్లకి ఎక్కువగా ప్రధాన్యత ఇవ్వలేదు. అసభ్య పదజాలం వాడలేదు. ఫ్యామిలీతో కలిసి చూసేలా మేకర్స్ తీసారు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ప్లస్ కథ వర్కవుట్ అయ్యాయి. ‌ముఖ్యంగా ఆ 'యూ ప్యాట్రన్' తరహాలో చంపే సీరియల్ కిల్లర్ ని పట్టుకునే ఎపిసోడ్, చివరగా బాక్స్ కనిపెట్టే ఎపిసోడ్, ప్రాజెక్టు ఎమ్ .. ఇలా ప్రతీ ఎపిసోడ్ ఇంటెన్స్ డ్రామాతో సాగుతుంది. ఫోరెన్సిక్ ఆఫీసర్ కేసుని డీల్ చేసే విధానం, ఆ డీటేయిలింగ్ ప్రేక్షకుడిని ఈ సిరీస్ కి కట్టిపడేస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. పాటలు కూడా సీన్ కి తగ్గట్టుగానే తీసారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్, బిజిఎమ్ సిరీస్ కి ప్రధాన బలం. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

శేఖర్ హోమ్ గా కేకే మీనన్, జయవ్రత్ షైనీగా రణ్ వీర్ షోరే, ఇరబోటిగా రసిక దుగల్ , ముంతాజ్ గా కీర్తీ కుల్హారీ ఆకట్టుకున్నారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు. 

ఫైనల్ గా :  ఎంగేజింగ్ ప్రెజెంటేషన్ తో సాగే ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని డోంట్ మిస్ .

రేటింగ్: 3 / 5

✍️. దాసరి మల్లేశ్