English | Telugu
ఆ సినిమాకి 20 కోట్లు తీసుకున్నాడు!
Updated : Aug 28, 2014
భారతీయ సినిమా చరిత్రలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా " ఐ " తెలుగులో 'మనోహరుడు'. 180 కోట్ల బడ్జెట్ తో గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమాని శంకర్ తెరకెక్కిస్తున్నారు. అయితే శంకర్ ఈ సినిమాకి స్టార్ హీరో కన్నా రెట్టింపు రెమ్యునరేషన్ అందుకున్నట్టు చెన్నై ఫిల్మ్ వర్గాల సమాచారం. " ఐ " సినిమాకి ఆయన దాదాపు 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని రికార్డ్ సృష్టించారట. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ దర్శకుడు ఇంత భారీ పారితోషికాన్ని అందుకోలేదట. సెప్టెంబర్ 15 చెన్నైలో గ్రాండ్ రేంజ్‌లో జరిగే ఈ సినిమా ఆడియోకు ఇంటర్నేషనల్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ వస్తున్నాడని అంటున్నారు. ఈ దీపావళి స్పెషల్‌గా తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, చైనీస్ భాషల్లో రికార్డ్ ప్రింట్స్‌తో ఈ సినిమా రిలీజ్ కానుంది.