English | Telugu

శంకర్ 'ఐ' టీజర్: బాధపడుతున్న ప్రొడ్యూసర్స్.!

దక్షిణాది సినిమా రంగంలో అత్యంత భారీబడ్జెట్తో రూపొందించిన తమిళ చిత్రం 'ఐ' తెలుగులో 'మనోహరుడు'గా వస్తోంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులకు నిర్మాతలు 30కోట్లు డిమాండ్ చేయడంతో తెలుగులో నిర్మాతలు ఎవ్వరూ కొనడానికి ముందుకు రాలేదని వార్తలు కూడా వచ్చాయి. తెలుగులో విక్రమ్ కు అంతగా మార్కెట్ లేదు కానుక శంకర్ ఒక్కడి మీద అంత భారం పెట్టి కొనలేమని అందరూ అన్నారట. ఆ తరువాత ఈ సినిమా రైట్స్ ని సూపర్ గుడ్ మూవీస్ వారు 30కోట్లకి తీసుకున్నట్లు సమాచారం.

లేటెస్ట్ గా ఈ సినిమా ఆడియో రిలీజైంది. ఈ సంధర్బంగా 'ఐ' అఫిషియల్ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ చూసిన వారందరూ శంకర్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ హాలీవుడ్‌ను తలపిస్తుందని, ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని పెంచేసినిమా అవుతుందని అంటున్నారు. ఈ టీజర్ ని ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా వుందని అంటున్నారు. అయితే ఈ టీజర్ ని చూసిన కొంతమంది తెలుగు నిర్మాతలు 'ఐ' సినిమా రైట్స్ ని మిస్ అయినందుకు బాధపడుతున్నారట. తెలుగు ఈ సినిమా 30కోట్లకు పైగా వసూళ్ళు చేసే అవకాశం వుందని భావిస్తున్నారట. అలాగే కొ౦తమంది డిస్ట్రిబ్యూటర్లు సూపర్ గుడ్ మూవీస్ వారికీ ఫ్యాన్సీ ఆఫర్లు పంపిస్తున్నారట. ఈ సినిమాని దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు. మరి టీజరే ఇలా వుంటే, సినిమా ఇంకెలా వుంటుందో?

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.