English | Telugu

నటి జయప్రద ఇంట విషాదం.. శోక సముద్రంలో కుటుంబం!

సీనియర్‌ నటి జయప్రద కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు రాజబాబు మృతి చెందారు. ఆయన మరణం కుటుంబ సభ్యుల్ని, శ్రేయోభిలాషుల్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. తన సోదరుడు మృతి చెందిన విషయాన్ని జయప్రద ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసింది. అయితే మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అలాగే అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారన్న సమాచారం కూడా లేదు. సోషల్‌ మీడియా ద్వారా తప్ప బహిరంగంగా తన సోదరుడి మృతి విషయాన్ని జయప్రద ప్రకటించలేదు. రాజబాబు మృతి పట్ల సినీ, రాజకీయ వర్గాల నుంచి సంతాప సందేశాలు అందుతున్నాయి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.