English | Telugu

'క‌న్నుల‌కే కానుక‌వే..' అంటూ పాడిన 'గంధ‌ర్వ‌'

'క‌న్నుల‌కే కానుక‌వే..' అంటూ పాడిన 'గంధ‌ర్వ‌'

 

'జార్జి రెడ్డి' ఫేమ్ సందీప్ మాధ‌వ్ హీరోగా అఫ్స‌ర్ హుస్సేన్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ 'గంధ‌ర్వ‌'. మ‌ల‌యాళం తార గాయ‌త్రి ఆర్‌. సురేశ్‌, శీత‌ల్ భ‌ట్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. యాక్ష‌న్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స‌మ‌ర్ప‌ణ‌లో ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ నుంచి "క‌న్నుల‌కే కానుక‌వే.. చిన్నిగుండెకే ఊపిరివే.. వెన్నెల‌కే వెలుతురువే.. గుండెల‌లో స‌వ్వ‌డివే" అనే ప‌ల్ల‌వితో సాగే రెండో పాట ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లైంది. ర్యాప్ రాక్ ష‌కీల్ మ్యూజిక్ స‌మ‌కూర్చిన ఈ మెలోడీ సాంగ్‌ను ధ‌నుంజ‌య్‌, మోష్మి నేహా ఎంతో ఆహ్లాద‌క‌రంగా ఆల‌పించారు. 

క‌థాప‌రంగా, సాంకేతిక‌ప‌రంగా, సంగీత‌ప‌రంగా, మేకింగ్ ప‌రంగా త‌మ 'గంధ‌ర్వ' చిత్రం ఎన్నెన్నో ప్ర‌త్యేక‌త‌లు క‌లిగి ఉంద‌ని చిత్ర ర‌చ‌యిత కూడా అయిన ద‌ర్శ‌కుడు అఫ్స‌ర్ హుస్సేన్ చెప్పారు. నెల రోజుల క్రితం డైరెక్ట‌ర్ బాబీ రిలీజ్ చేసిన ఫ‌స్ట్ సాంగ్‌కు మంచి స్పంద‌న ల‌భించింద‌ని తెలిపారు.

సాయి కుమార్, సురేష్, బాబు మోహన్, పోసాని కృష్ణ మురళి, ఆటో రాంప్రసాద్, జబర్దస్త్ రోహిణి, మధు నంబియార్, అమెరికా జై రామ్, రూపాలక్ష్మి,  పింగ్ పాంగ్ సూర్య, ఆర్జీవీ రామ్, ఫన్ బకెట్ రాజేష్  తదితరులు ముఖ్య భూమికలు  పోషించిన 'గంధర్వ' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 

మార్చి మూడవ వారంలో ఫస్ట్  కాపీ  సిద్ధమయ్యే ఈ యాక్షన్ థ్రిల్లర్ కు డిఓపి: జవహర్ రెడ్డి, మ్యూజిక్: ర్యాప్ రాక్ షకీల్, ఎడిటర్: బస్వా పైడి రెడ్డి, ఆర్ట్: కురుమూర్తి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై .నాగు, చీఫ్ కో-డైరెక్టర్ ప్రకాష్ పచ్చల, నిర్మాత: ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అఫ్సర్ హుస్సేన్.