English | Telugu

సార్పట్ట  2 వచ్చేస్తుంది..ఇక అభిమానులకి పండుగే

విభిన్న చిత్రాల కథానాయకుడు ఆర్య(Arya)విభిన్న చిత్రాల దర్శకుడు పా రంజిత్(Pa ranjith)కాంబోలో తమిళంలో తెరకెక్కిన చిత్రం 'సార్పట్ట(Sarpatta)పరంపర'. కోవిడ్ సంభవించి థియేటర్స్ మూతపడంతో ఓటిటిలో అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)వేదికగా జులై 2021న తమిళ,తెలుగు భాషల్లో విడుదలయ్యి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. పార్ట్ 2 కోసం అందరూ వెయిట్ చేసేలా ఓటిటి చరిత్రలో సరికొత్త రికార్డులు కూడా సృష్టించిందని చెప్పవచ్చు.

ఇక సార్పట్ట పార్ట్ 2(satpatta 2)ఉంటుందని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. కానీ షూటింగ్ అప్ డేట్ ని ఇవ్వలేదు. రీసెంట్ గా తమిళ చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఆగస్ట్ నుంచి సార్పట్ట 2 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి మేకర్స్ నుంచి త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ ప్రస్తుతం సినీ అభిమానుల్లో సరికొత్త జోష్ ని తెచ్చింది. 1970 వ సంవత్సరంలో అప్పటి ఉత్తర మద్రాసులో కబిలాన్ అనే దళిత వ్యక్తి మద్రాస్ షిప్ పోర్ట్ లో కార్మికుడుగా పని చేస్తు తన తండ్రి మునిరత్నంలాగా పెద్ద బాక్సర్ కావాలని కలలు కంటు ఉంటాడు. కానీ తల్లి బక్కియమ్ మాత్రం మునిరత్నం గెలుపుని ఓర్చుకోలేని ప్రత్యర్థి ముఠా మునిరత్నంని చంపినట్టే కబిలాన్ ని చంపుతారని బాక్సింగ్ కి ఒప్పుకోదు. ఆంగ్లో ఇండియన్ గాడ్ ఫాదర్ కెవిన్ కబిలాన్ అభిరుచిని అర్ధం చేసుకుని ప్రోత్సహిస్తుంటాడు.

1975లో, ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిలో రాజకీయ స్వేచ్ఛలను నిలిపివేసిన టైంలో సార్పట్ట వంశానికి చెందిన బాక్సింగ్ కోచ్ ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీ సభ్యుడు రంగన్ ఒక బాక్సింగ్ టోర్నమెంట్‌ ని నిర్వహిస్తుంటాడు. అందులో సార్పట్ట వంశానికి చెందిన ప్రధాన బాక్సర్ 'మీరన్' ఇడియప్పన్ వంశానికి చెందిన వెంబులి చేతిలో ఓడిపోతాడు. సర్పట్ట ఓడిపోతే మళ్లీ ఎప్పటికీ పోరాడకూడదనే షరతును అంగీకరిస్తూ, తదుపరి మ్యాచ్‌లో వెంబులిని ఓడించడానికి ఎంతో కష్టపడి కబిలన్ ని తీసుకొస్తాడు.కానీ ఆ తర్వాత బాక్సింగ్ వద్దని అనుకోని ఆర్య వెళ్లిపోవడం, తాగుడికి బానిస కావడం, మళ్ళీ వచ్చి బాక్సింగ్ లో విజయాన్ని సాధించడం ఇలా కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో పార్ట్ 2 కథ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో ఉంది. కబిలన్ మునిరత్నంగా ఆర్య, భార్య మరియమ్మగా దుషార విజయన్ కనపడ్డారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.