English | Telugu

పవన్ మళ్లీ బిజి ..పొలిటిక్స్‌లోనా?సినిమాల్లోనా?

సర్దార్ గబ్బర్ సింగ్ రిజల్ట్‌తో దెబ్బతిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫ్యూచర్‌పై ఫోకస్ చేశారు. 2019 నాటికి రాజకీయాల్లో దిగాలనుకుంటున్న పవన్ వీలైనంత త్వరగా ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు సినిమాల కథ విన్న కళ్యాణ్..వాటిని ఫైనల్ చేయనున్నాడు. మైత్రీ మూవీస్, 14 రీల్స్, పీవీపీ లాంటి భారీ సంస్థలు క్యూలో ఉన్నా తన స్నేహితులకు సినిమాలు చేస్తానని మాట ఇచ్చాడు.

కెరిర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా చెప్పుకునే ఖుషి లాంటి హిట్‌ని ఇచ్చిన ఎస్‌.జె సూర్య దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కిండానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. తొలుత దీనిని మైత్రీ మూవీస్‌లో చేయాలనుకున్నా ఇప్పుడు వారిని కాదనీ త్రివిక్రమ్, శరత్ మరార్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌లో నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నాడు. దాంతో పాటు ఏఎమ్ రత్నం బ్యానర్‌లో కూడా సినిమాకు ఓకే చెప్పాడు. ఈ నాలుగు సినిమాలు చేసి సక్సెస్‌ఫుల్‌గా సినిమాల నుంచి నిష్క్రమించాలని పవన్ డిసైడయ్యాడు. మొత్తానికి తను ఆర్థికంగా సెటిల్ అవ్వాలని గబ్బర్ సింగ్ స్కెచ్ గీస్తున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.