English | Telugu

ఆసత్తా పవన్ కు ఉంది.. నేను తోడుగా ఉంటానన్న చిరు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం ఆడియో రిలీజ్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. అన్నాదమ్ములను ఒకే వేదికపై చూసిన మెగా అభిమానులు ఆనందంతో చేసిన కేరింతలతో హోటల్ ప్రాంగణం మారుమోగిపోయింది. ఇదంతా ఒక ఎత్తైతే చిరంజీవి పవన్ గురించి స్పీచ్ ఇవ్వడం మరో ఎత్తు. తన తమ్ముడి గురించి అన్నయ్య మాట్లాడుతూ.. తాను ఇటీవల చూసిన ఒక ఇంటర్య్వూలో ఇంకా రెండు మూడు సినిమాలే చేస్తానని.. తరువాత సినిమాలు చేయనని చెప్పినట్టు చదివానని గుర్తు చేశారు. "నేను చిన్నప్పుడు చెబితేనే నటుడయ్యాడు. అప్పుడు నా మాట విన్నాడు.. ఇప్పుడు కూడా నా మాట వినాలి.. జోడు గుర్రాల మీద స్వారీ చేయగలిగిన సత్తా పవన్ లో ఉంది. వేరేరంగంలో రాణిస్తూనే, సినిమాలు కూడా చేస్తుండాలి. నేను అండగా ఉంటాను" అన్నారు. మరి చిరు చెప్పిన వేరే రంగం రాజకీయ రంగంమే కదా...

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.