English | Telugu

భ్రష్టు పట్టిన టాలీవుడ్..!!

తెలుగు సినిమా స్టాండర్డ్స్ మరీ అంత దిగజారిపోయాయా? ఎవడు పడితే వాడు హీరో అయిపోవచ్చా? రంగు,రూపు, అందం, చందం, అభినయం ఏమీ అవసరం లేదా? ముఖానికి రంగేసుకుని బిల్డప్ లు ఇస్తేచాలా? వీటన్నింటికీ అవుననే చెప్పాలేమో!. ఎందుకంటే సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్లుకూడా హీరోలైపోతున్నారంటే తెలుగుసినిమా దౌర్భాగ్యం కాక మరేంటి!

ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీఆర్ తెరవేల్పులుగా వెలిగారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నారు. నటన అంటే అంతెత్తున చూసేవారు. అలాంటిది నేటి ప్రేక్షకులకు పిచ్చేమీ పట్టలేదు కదా? లేదంటే సంపూర్ణేశ్ బాబు హీరో ఏంటండీ? . హృదయం కాలేయంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూకి బర్నింగ్ స్టార్ అనే బిరుదు తనకు తనే ఇచ్చుకున్నాడు. నాలుగు అతి డైలాగ్స్, ఆరుగులు హీరోల్ని ఇమిటేషన్ తప్ప దేనికీ పనికిరాడు. ఏదో పేద్ద నటదిగ్గజాన్ని మిస్సైపోతున్నాం అన్నట్టు వరుస పెట్టి ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు. కుర్రాడు కూడా ఎక్కువ ఫీలై హీరోగా వరుస సినిమాలు తీస్తున్నాడు. సంపూ చంపుతున్నాడన్న సంగతి ఏ ఒక్కరికీ అర్థంకావడం లేదా?

అయినా ఈ కుర్రాడి అని ఏం లాభం లెండి. ఇండస్ట్రీలో దిగ్గజాలంతా....ఎగేసుకుని మరీ పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. ముఖ్యంగా దాసరి, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్లు సంపూ అంటే సూపర్ స్టార్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇలాంటి హీరోల వల్ల వాళ్లకేమైనా ఉపయోగం ఉందా అంటే అదీ లేదు. కానీ వాళ్లకి నచ్చని వాళ్లని తిట్టేందుకు....టార్గెట్ చేసేందుకు సంపూ ఓ పావు మాత్రమే. అసలు సంపూని ఏం చూసి పొగుడుతున్నారో అంతుచిక్కడం లేదు. వీళ్లు చాలరన్నట్టు టాలీవుడ్ జక్కన్నగా పేరుసంపాదించుకున్న రాజమౌళికి నిత్యం వార్తల్లో ఉండకపోతే నిద్రపట్టదాయె. అందుకే తిండైనా మానేస్తాడు కానీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ని వదిలిపెట్టడు. అసలు సంపూని ప్రేక్షకులమీదకి వదిలిన పాపం రాజమౌళిదే. ఆ మాహానుభావుడి ట్వీట్ తోనే ఈ సింగం దాడిచేస్తోంది.

కోట్లాది ప్రేక్షకులు గొప్పగా చెప్పుకునే కళారంగం క్వాలిటీ ఈ స్థాయికి దిగజారిపోతుందని కల్లో కూడా అనుకోలేదు. కేవలం అందంగా లేడనే సంపూని విమర్శిస్తున్నాం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కళకు అందం కొలమానం కాదు. రజనీకాంత్, ప్రభుదేవా, లారెన్స్, ధనుష్, అల్లరి నరేశ్ ...ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అందగాళ్లేం కాదు. కానీ వాళ్లలో టాలెంట్ ఉంది. నటనా సామర్థ్య ఉంది. ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయి ఆదరణ వారికి దక్కలేదు. అలాంటి కళారంగంలో ఏ ఒక్క టాలెంట్ లేని సంపూర్ణేశ్ బాబు వీరంగం సృష్టిస్తున్నాడు. పైగా హీరోగా ఆదరించి పిలిచి మరీ లైవ్ లో కూర్చోబెడుతున్నారంటే ఛానెల్స్ సైతం ఏ స్థాయికి దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికే విషయం లేని వారసులు ఇండస్ట్రీపై దాడికిదిగారు. ఎన్ని దండయాత్రలు చేసినా ఒక్క సినిమా కూడా హిట్టవడం లేదు. అయినా బాగా సంపాదించిన బాబులు...వారికి వారే సమర్పించేసుకుని ప్రేక్షకులని హింస పెడుతూనే ఉన్నారు. వీరినే భరించలేకపోతున్నాం దేవుడా అంటే సంపూర్ణేశ్ బాబులాంటి వాళ్లు సైతం తెరపై అరాచకాలు సృష్టిస్తున్నారు.అయినా ఇతర బాషా చిత్రాలకు అవార్డులు వస్తాయి కానీ తెలుగు సినిమాలకు రావని తెగబాధపడిపోతుంటారు. ఇలాంటి వాళ్లంతా హీరో అవతారం ఎత్తితే అవార్డులు సైతంభయపడి పారిపోతున్నాయి. పోనీ అందులో ఏదైనా సందేశం అయినా ఉందా అంటే అంతసీన్ లేదు. ముక్కూ మూతి తిన్నగా లేని హీరో కోసం కూడా హీరోయిన్స్ పోటీపడినట్టు చూపిస్తారు. ఇదెంత దారుణం చెప్పండీ?

ఇలాంటి వాళ్లంతా హీరోలుగా మారుతున్నప్పుడు, అభినయానికి విలువ లేనప్పుడు అవార్డుల గురించి పెద్దలు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. ఏదిఏమైనా ఇకనైనా ప్రేక్షకులు కళ్లు తెరవండి. కళారంగాన్ని కాపాడండి. విషయం లేని హీరోలను, విలువల్లేని పెద్దాళ్లకు బుద్ధిచెప్పండి. ఎలాంటి టాలెంట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటేనే భయం పుట్టేలా చేయండి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.