English | Telugu

ప‌వ‌న్‌ని ఇంకా న‌మ్ముతున్నాడు

గ‌బ్బ‌ర్ సింగ్ 2 సినిమా విష‌యంలో సంత‌ప్‌నందికి చుక్కెదురు అయ్యింది. ఈ సినిమా కోసం సంపత్ దాదాపు రెండేళ్లు ఎదురుచూశాడు. ప‌వ‌న్ అభిరుచికి త‌గ్గ‌ట్టు స్ర్కిప్టులో మార్పులు కూడా చేశాడు. కానీ.. ఈ సినిమా నుంచి సంప‌త్ నందిని త‌ప్పించి మ‌రో ద‌ర్శ‌కుడు (బాబిని అనుకొంటున్నారు) ఎంచుకొన్నార‌ని వార్త‌లొస్తున్నాయ్‌. అయితే చిత్ర‌బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. దాంతో సంప‌త్‌నందిలో ఆశ‌లూ చావ‌లేదు. ''ఈ సినిమాపై ఎంతో న‌మ్మ‌కం పెట్టుకొన్నా. ఇంత కాలం వెయిట్ చేశా. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌మ్మ‌కం ఉంది. ఆయ‌న న‌న్ను మోసం చేయ‌రు'' అని సంప‌త్ స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోతున్నాడ‌ట‌. ప‌వ‌న్‌కి ఇంకా న‌మ్ముతున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ప‌వ‌న్‌ని క‌లుస్తాన‌ని, గ‌బ్బ‌ర్ సింగ్ 2 పూర్తి స్ర్కిప్టు చ‌దివి వినిపిస్తాన‌ని, ప‌వ‌న్ ఓకే అంటాడన్న న‌మ్మ‌కం ఉంద‌ని చెప్తున్నాడ‌ట‌. అయితే సంప‌త్ నంది స‌న్నిహితులు మాత్రం... అత‌న్ని వారిస్తున్నారు. ప‌వ‌న్‌ని క‌లిసి లాభం లేద‌ని, ర‌వితేజ సినిమాపై దృష్టిపెట్ట‌డం కంటే గ‌త్యంత‌రం లేద‌ని చెప్తున్నార‌ట‌. కానీ సంప‌త్‌లో ఆశ‌లు చావ‌లేదు. మ‌రి ప‌వ‌న్, సంప‌త్‌నంది మొర ఆల‌కిస్తాడో, లేదో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.