English | Telugu

నితిన్, సమంతల అ..ఆ మొదలైంది

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంతల సినిమా ప్రారంభోత్సవం గురువారం ఉదయం రామానాయుడు స్టూడియోలో జరిగింది. మొదటి నుంచీ త్రివిక్రమ్ సినిమా పేర్లు మాంచి క్యాచీగా వుంటాయి. రెండు, మూడు, నాలుగు అక్షరాలే. ఈసారి కూడా అలా రెండు అక్షరాల పేరే పెట్టారు..అ..ఆ అంటూ కానీ ఇది షార్ట్ కట్టే,.పూర్తి పేరు...'అనసూయ రామలింగం' వర్సెస్ 'ఆనంద్ విహారి అన్నమాట. దీన్ని ఉపశీర్షికగా పెట్టారు. అక్టోబర్ 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2016 సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.

నితిన్-సమంతలతో త్రివిక్రమ్-రాధాకృష్ణ తమ హారిక హాసిని బ్యానర్ పై నిర్మిస్తారు. సమంతకు తోడుగా మరో హీరోయిన్ ను కూడా ఎంపిక చేసారు. ప్రేమమ్ సినిమాలో నటించిన అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా నటిస్తుంది. వాస్తవానికి ఈమెను, ఇదే బ్యానర్ లో నాగచైతన్యతో నిర్మించే ప్రేమమ్ రీమేక్ కు కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

నితిన్-త్రివిక్రమ్ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తారు. నటరాజ్ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీని, రాజీవన్ ఆర్ట్ డైరక్షన్ ను అందిస్తారు. పూర్తిగా ఫ్రెష్ లుక్ తో, డిఫరెంట్ టేకింగ్ తో సినిమా చేయాలని చూస్తున్నారు త్రివిక్రమ్. అందుకే తన టెక్నీషియన్స్ బ్యాచ్ ను కూడా మార్చేసారు. మేకింగ్ అంతా వైవిధ్యంగానే వుంటుంది అని వినికిడి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.