Read more!

English | Telugu

సుబ్రమణ్యం...ఏం చేయబోతున్నాడు?

సాయిధ‌రంతేజ్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజైంది. ఈ సినిమాకి టాక్ ఎలా వస్తుందోనని హీరో సాయిధ‌రంతేజ్, డైరెక్టర్ హరీష్ శంకర్ లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా వీరిద్దరికి ఎంతో ముఖ్యం.

గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బ్లాస్టర్ తరువాత రామయ్య వస్తావయ్య లాంటి ఫ్లాప్ తో ఒక్కసారిగా కిందకు పడిపోయాడు హరీష్. అతను తిరిగి స్టార్ దర్శకుల లీగ్ లోకి రావాలంటే ఈ సినిమా హిట్ అతనికి ఏంతో అవసరం. అలాగే మొదటి సినిమా నుంచే స్టార్ మెటిరియల్ అంటూ పేరు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ ఈ సినిమాతో తన మార్కెట్ రేంజు ఎంతో నిరూపించుకోవాల్సిన అవసరం వుంది.

పిల్లా నువ్వులేని జీవితం సినిమాకి హిట్ టాక్ వచ్చిన ఆ సినిమా కలెక్షన్ లను ఊహించిన స్థాయిలో రాబట్టలేక నిరాశపరిచింది. దీంతో ఈ సినిమాతో హిట్ కొట్టి త‌న రేంజ్ ని పెంచుకోవాల‌ని చూస్తున్నాడు ఈ మెగా హీరో. మరి 'సుబ్రమణ్యం ఫర్ సేల్'తో హరీష్, సాయి అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుతారా ?..ఈ సినిమా వీరిద్దరి కోరిక‌లను తీర్చుందా? అనేది కొద్ది సేపట్లో తేలనుంది.