English | Telugu
రాబిన్ విలియమ్స్ సూసైడ్..సమంత దిగ్భ్రాంతి
Updated : Aug 13, 2014
హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత రాబిన్ విలియమ్స్ (63) బలవన్మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాబిన్ విలియమ్స్ ఆకస్మిక మరణానికి చింతిస్తూ పలువురు సెలబ్రెటీలు ట్విట్టర్ ద్వారా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. ఈ విషయంపై సమంత స్పందిస్తూ.. ఈ విషయం తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యా. ఆ క్షణం నుంచి ఆయన గురించే ఆలోచిస్తున్నా. రాబిన్స్ నటనని ఎంత ఇష్టపడ్డానో ఇప్పుడే తెలుస్తోంది. మనకు ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదుర్కొని నిలబడాలి. రేపటి రోజు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? అని ట్విట్టర్ లో రాసింది సమంత.