English | Telugu

ఎట్టకేలకు సల్మాన్ ఖాన్ పెళ్లిచేసుకుంటానంటున్నాడు..!

బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఇన్నాళ్లూ సింగిల్ గానే జీవితాన్ని నెట్టుకొచ్చేసిన సల్లూభాయ్ కు ఎట్టకేలకు ఒక ఇంటివాడు కావాలనే కోరిక కలిగిందట. గత కొంతకాలంగా సల్మాన్, రొమానియా భామ లూలియా వంటూర్ తో ప్రేమలో ఉన్నాడు. ఎక్కడికెళ్లినా వెంట ఈ భామను తీసుకెళ్తున్నాడు. గతేడాది డిసెంబర్ లో 50వ పడిలోకి అడుగుపెట్టిన సల్మాన్ పెళ్లి చేసుకుంటూ చూడాలనేది అతని తల్లి కోరిక. అందుకే ఆమె కోసం ఇక పెళ్లి చేసుకోవాలని సల్మాన్ డిసైడ్ అయ్యాడట. గత కొంతకాలంగా పార్టీలకు, పబ్బులకు కలిసే తిరుగుతున్న ఈ జంట, వచ్చే ఏడాది పెళ్లితో ఒక్కటౌతారంటున్నారు. జయహా షూటింగ్ చేస్తున్న సమయంలో లూలియా తో సల్మాన్ కు పరిచయం ఏర్పడింది. తర్వాత పరిచయం స్నేహంగా, ప్రేమగా మారింది. అంతకు ముందు ఐశ్వర్య, కత్రినాలతో సల్మాన్ ప్రేమాయణం నడిపినా, అది పెళ్లి వరకూ రాలేదు. ఈ సారైనా సల్మాన్ ఒక ఇంటివాడు కావాలని బాలీవుడ్ కోరుకుంటోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.