Read more!

English | Telugu

అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలనుంది: సల్మాన్ ఖాన్

"సల్మాన్ పెళ్లి" గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఈ విషయమై నెటిజన్లు వేసిన జోక్స్ కు లెక్కలేదు. ఆఖరికి మీడియావారు సల్మాన్ ను ఎక్కడ కలిసినా "మీ పెళ్ళెప్పుడు?" అని ప్రశ్నించి సల్మాన్ కు సరిగా నిద్ర కూడా పట్టనివ్వలేదు. మొన్నటివరకూ అంటే కోర్ట్ కేసు అని చెప్పి తప్పించుకొన్నాడు. ఇప్పుడు ఆ సమస్య కూడా లేకపోవడంతో.. "సల్మాన్ పెళ్ళి" ఇప్పుడు నేషనల్ ప్రోబ్లమ్ అయిపోయింది. దాంతో సల్మాన్ కూడా బాగా విసిగిపోయాడు. మనోడికి ఎఫైర్లు కూడా తక్కువేమీ కాదు కదా. అందుకే తనతో గత కొంతకాలంగా డేట్ చేస్తున్న తన గర్ల్ ఫ్రెండ్ లులియాను పెళ్లాడాలని ఫిక్స్ అయిపోయాడట. ఇటీవల "సుల్తాన్" ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా చానల్ తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు సల్మాన్. "నాకు అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలనుంది" అని చెప్పాడు. మరి సల్మాన్ పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? జరుగుతుందో చూడాలి!