Read more!

English | Telugu

అభిమాని ఎదిగినప్పుడే నాకు సంతోషం: చిరు

తెలుగు చిత్రసీమలో ఎంతమంది కథానాయకులున్నప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవిది ప్రత్యేకమైన స్థానం. ఎవరి అండ లేకుండా స్వయంకృషితో ఎదిగిన కృషీవలుడాయన. ఆయనంటే ఇష్టపడనివారు, ఆయన్ను స్పూర్తిగా తీసుకోనివారు ఉండరంటే అతిశయోక్తి. మన తెలుగు భాషకు చెందినవారు మాత్రమే కాకుండా ఇతర భాషాల హీరోలు, నటులు కూడా చిరంజీవిని ఆరాధిస్తుంటారు. అలా చిరంజీవిని అభిమానించడంతోపాటు ఆరాధించేవారిలో కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ ఒకడు. అందుకే ఆ అభిమానానికి గుర్తుగా నిన్న జరిగిన "జక్కన్న" ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన మెగాస్టార్.. ఆడియో వేడుకలో మాట్లాడుతూ.. "సునీల్ నా అభిమాని అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. అభిమాని ఎదిగినప్పుడే నాకు సంతోషం. సునీల్ చాలా కష్టపడి పైకి వచ్చినవారు. అతడి కష్టాన్ని అభినందించకుండా ఉండలేను. "జక్కన్న" సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అన్నారు. తన అభిమాన కథానాయకుడు చిరంజీవి స్వయంగా తనను ఈ విధంగా మెచ్చుకోవడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు సునీల్!