English | Telugu

సల్మాన్‌ ఖాన్ ను దోషిగా తేల్చిన కోర్టు

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ కేసులో సల్మాన్ ఖాన్ ను కోర్టు దోషిగా తేల్చింది. ఘటన జరిగినపుడు సల్మాన్ ఖాన్ తాగి ఉన్నట్లు కోర్టు నిర్దారించింది. సల్మాన్ ఖాన్ డ్రైవర్ అశోక్ సింగ్ డ్రైవింగ్ చేస్తున్నట్లు చెప్పిన కట్టుకథను నమ్మట్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సల్మాన్ ఖాన్ తాగి ఉండటమే కాకుండా ప్రమాద సమయంలో అతడి వద్ద లైసెన్స్ కూడా లేదని తెలిపింది. సల్మాన్ ఖాన్ పై 8 ఆరోపణలు రాగా, అన్నీ కూడా నిరూపణ అయినట్లు కోర్టు వెల్లడించింది. ఘటన తరువాత 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం నేడు ఉదయం 11.15 గంటలకు తీర్పు వెలువడించింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.