English | Telugu

స‌త్తారు వారి ‘గుంటూరు టాకీస్’

ఎల్బీడ‌బ్ల్యూ , రొటీన్ ల‌వ్ స్టోరీ, చంద‌మామ క‌థ‌లు లాంటి ఫీల్ గుడ్ సినిమాలు తీశాడు ప్ర‌వీణ్ స‌త్తారు. ఆయన 'చంద‌మామ క‌థ‌లు' చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డును సొంత చేసుకుంది. ఇప్పుడాయ కొత్త సినిమాకి రంగం సిద్దమైయింది. గత చిత్రాల మాదిరగానే ఓ విభిన్నమైన సబ్జెక్టు ను రెడీ చేసున్నాడాయన. స్టార్ కాస్టింగ్ కూడా జరిగిపోయింది. ఈ చిత్రం కోసం మధుశాలిని, శ్రద్ధ దాస్ ఎల్బిడబ్ల్యూ ఫేం సింధు ను ఫీమేల్ లీడ్స్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. వీరితో పాటు సీనియర్ నరేష్, బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ లను ప్రధాన పాత్రదారులుగా వుంటారని టాక్. ఈ చిత్రానికి ఓ డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ అయ్యింది. ‘గుంటూరు టాకీస్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలిసింది. త్వరలోనే చిత్రానికి సంభదించిన అధికారిక ప్రకటన రానుంది.